కరోనా మూలాలపై వుహాన్లో పరిశోధనలు చేయనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం చైనాకు చేరుకుంది. చైనాకు వెళ్లాల్సిన బృందలోని వారికి సింగపూర్లో కరోనా పరీక్షలు చేయించగా ఇద్దరికి పాజిటివ్(కొవిడ్-19 యాంటీబాడీలు) వచ్చిందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
సింగపూర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన 13 మంది శాస్త్రవేత్తలు చైనాకు చేరుకున్నారు. వీరంతా చైనా కొవిడ్ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు.
కరోనా నిబంధనలను చైనా కచ్చితంగా పాటిస్తుందని.. డబ్ల్యూహెచ్ఓ బృందానికి కావాల్సిన మద్దతు, సౌకర్యాలు అందిస్తుందని.. చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: చైనా టమాటాలపై అమెరికా నిషేధం.. కారణమిదే