ETV Bharat / international

గూఢచర్య అభియోగం.. పాక్​ చెరలో ఇద్దరు భారతీయులు - పాక్​ భద్రతా దళాలు

నియంత్రణ రేఖ వద్ద పాక్​ సైనిక విభాగం ఇద్దరు భారతీయులను అరెస్ట్​ చేసింది. వారిని గూఢచారులుగా అనుమానించిన దాయాది బలగాలు.. అనంతరం ఆ దేశ పోలీసులకు అప్పగించారు.

Two Indian spies arrested in Gilgit-Baltistan after crossing LoC
ఇద్దరు భారతీయుల్ని అరెస్ట్​ చేసిన పాక్​ సైన్యం
author img

By

Published : Jun 13, 2020, 6:22 PM IST

పాక్​ సరిహద్దులో ఇద్దరు భారతీయులను అరెస్ట్​ చేసింది ఆ దేశ సైన్యం. గిల్​గిట్​- బాల్టిస్థాన్​ నియంత్రణ రేఖ ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్న పాక్​ సైనిక బృందం.. ఆ ఇద్దరూ గూఢచారులనే అభియోగం మోపుతూ ఆ దేశ పోలీసులకు అప్పగించింది.

పట్టుకున్న ఇద్దరి వ్యక్తుల నుంచి వార్తా పత్రిక, భారత కరెన్సీ నోట్లు, గుర్తింపు కార్డులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పాక్​ పోలీసులు చెప్పారు. ఇరువురూ కశ్మీర్​కు చెందిన నూర్​ మహ్మద్​ వాణి, ఫిరోజ్​ అహ్మద్​ లొనేలుగా తెలిపారు అక్కడి పోలీసులు. గూఢచర్యం కోసమే వారు పాక్​లోకి ఆక్రమంగా ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: నేపాల్​ కొత్త మ్యాపునకు ఆమోదం లాంఛనమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.