ETV Bharat / international

ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- 52 మంది మృతి - హషీమ్​ ఫుడ్స్​లో అగ్ని ప్రమాదం

factory fire
బంగ్లాదేశ్​లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jul 9, 2021, 2:00 PM IST

Updated : Jul 9, 2021, 9:36 PM IST

13:56 July 09

బంగ్లాదేశ్​లో అగ్ని ప్రమాదం

మంటలు ఆర్పుతున్న ఫైర్​ సిబ్బంది

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా శివార్లలోని ఓ కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడానికి భవంతి పైనుంచి కిందికి దూకినట్లు పేర్కొంది.  

రూప్​గంజ్​లోని హషీమ్​ ఫుడ్స్​ అనే  జ్యూస్​ కర్మాగారంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఆరు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే భారీ నష్టం జరిగింది. భవనం కింది భాగంలో తొలుత మంటలు చెలరేగాయిని ప్రాథమిక  దర్యాప్తులో తెలింది. అయితే ఫ్యాక్టరీలో రసాయనాలు, ప్లాస్టిక్​ సీసాలు ఎక్కువగా ఉండడం కారణంగా చాలా వేగంగా మంటలు వ్యాప్తి చెందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న అధికారులు.. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 18 ఫైర్​ ఇంజన్​లు మంటలు ఆర్పడంలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. తగలబడుతున్న కర్మాగారం నుంచి 52 మృతదేహాలు వెలికితీశారు. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియకపోవడం వల్ల బంధువులు కర్మాగారం ఎదుట వేచిచుస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 44 మందిని గుర్తించినట్లు ఓ పత్రిక తెలిపింది.  

ప్రమాదం జరిగేటప్పుడు ఫ్యాక్టరీ ముందు, వెనుక గేట్లు మాత్రమే తెరిచి ఉంచడం వల్ల ఎక్కువమంది మంటల్లో చిక్కుకుపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా ఆ భవనం సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని అంటున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కోసం జిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. 

ఇదీ చూడండి: 'లామ్డా​' వైరస్​ దెబ్బ- ఆ దేశాలు గజగజ!

Last Updated : Jul 9, 2021, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.