ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ సోదరి.. తమ అదుపులో ఉన్నట్లు ప్రకటించింది టర్కీ. ఉత్తర సిరియాలోని అజాజ్‌లో నివాసముంటున్న రస్మియాను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పట్టుకున్నట్లు వెల్లడించింది.
ఐసిస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ అక్క అయిన రస్మియాను సోమవారం సాయంత్రం.. టర్కీ ఆపరేషన్ దళం అధీనంలోకి తీసుకుంది. 65 ఏళ్ల రస్మియాతో పాటు ఆమె భర్త, అల్లుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఐసిస్ ఉగ్ర సంస్థతో రస్మియాకూ సంబంధాలు ఉన్నందున.. ఆమెను విచారిస్తే కీలకమైన విషయాలు బయటికొచ్చే అవకాశాలు ఉన్నాయి. గత వారం ఆమె అన్న బాగ్దాదీ అమెరికా చేతికి చిక్కి, తనను తాను పేల్చుకుని హతమయ్యాడు. అనంతరం.. ఐసిస్‌కు కొత్త నాయకుడినీ ప్రకటించింది.
ఇదీ చూడండి:ఐఎస్ అగ్రనేత బాగ్దాదీ హతం.. అమెరికా ప్రకటన