ETV Bharat / international

ట్రంప్​-కిమ్​ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్ - శ్వేతసౌధం మీడియా కార్యదర్శి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా పర్యటన సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. మీడియా ప్రతినిథులపై ఉత్తర కొరియా భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు ఘర్షణ జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్రంప్​-కిమ్​ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్
author img

By

Published : Jun 30, 2019, 3:41 PM IST

Updated : Jun 30, 2019, 4:06 PM IST

ట్రంప్​-కిమ్​ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా చారిత్రక పర్యటనను కవర్​ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై... భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఫలితంగా ఇరు వర్గాలకు వాగ్యుద్ధం జరిగింది. ఘర్షణకు దారితీసింది. పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది.

త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న శ్వేతసౌధం మీడియా కార్యదర్శి స్టెఫానీ గ్రిషామ్ ఈ ఘర్షణలో గాయపడ్డారు.

పన్​మున్​జామ్​లో ట్రంప్, కిమ్​ భేటీ కోసం ఉద్దేశించిన ఫ్రీడమ్ హౌస్​​లో విలేకరులు ప్రవేశించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది. అమెరికా విలేకరులను గదిలోకి ప్రవేశించకుండా కొరియా సిబ్బంది అడ్డుకున్నారు. సీక్రెట్ సర్వీస్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.

ఇదీ చూడండి: మన్​ కీ బాత్​ 2.0: ప్రజా ఉద్యమంలా జల సంరక్షణ

Intro:Body:

er

Conclusion:
Last Updated : Jun 30, 2019, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.