ETV Bharat / international

'హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్నాక ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారు' - White House news

కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వటం సరైంది కాదని, దుష్ప్రభావాలు తలెత్తుతాయని ఇటీవల కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఔషధాన్ని రెండు వారాలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కైలీ మెక్ఎన్నే. 65 ఏళ్లుగా ఈ మందు వినియోగంలో ఉందని గుర్తుచేశారు. కరోనాపై చాలా మంది వైద్యులు హెచ్​సీక్యూని తీసుకుంటున్నారని, మంచి ఫలితాలే వచ్చాయన్నారు.

Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
author img

By

Published : May 29, 2020, 9:50 AM IST

కరోనా మహమ్మారిపై మంచి ఫలితాలు ఇస్తోన్న మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​ను రెండు వారాల పాటు తీసుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు శ్వేతసౌధం ఉన్నతాధికారి. కరోనా వైరస్ బారిన పడినట్లు అనిపిస్తే మళ్లీ తీసుకుంటారని తెలిపారు.

కరోనాపై పోరాటంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ గేమ్ ఛేంజర్​గా పేర్కొన్నారు ట్రంప్. తాను తీసుకుంటున్నాని తెలిపారు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు వైద్యులు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అధ్యక్షుడు హెచ్​సీక్యూను తీసుకోవటంపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు వివరాలు వెల్లడించారు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కైలీ మెక్ఎన్నే.

" హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవటంపై అధ్యక్షుడు ట్రంప్​ను అడిగాను. అందుకు ఆయన తాను చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఔషధం తీసుకోవటం వల్ల గొప్ప అనుభూతితో ఉన్నానన్నారు. వైరస్ బారిన పడినట్లు భావించినట్లయితే.. మళ్లీ తీసుకుంటానని చెప్పారు. ట్రయల్స్​లో భాగంగా మిచిగాన్​లోని హెన్రీ ఫోర్డ్ ఆస్పత్రిలో 3 వేల మంది వైద్య సిబ్బంది హెచ్​సీక్యూను తీసుకుంటున్నారు. రోగనిరోధకతను పెంచినట్లు సమాచారం ఉంది. చాలా మంది వైద్యులు, పరిశోధకులు ఈ ఔషధానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇది అధ్యక్షుడు ట్రంప్, కొందరు వైద్యులకే పరిమితం కాదు. వేల మందిపై ఈ డ్రగ్ వినియోగించిన సమయంలో ఎలాంటి ప్రధాన సమస్యలు కనిపించలేదని, కరోనా నుంచి కోలుకున్నారని మిన్నెసోటా వైద్య విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు."

- కైలీ మెక్ఎన్నే, శ్వేతసౌధం మీడియా కార్యదర్శి.

ఎవరైనా ఈ మందును వినియోగించాలని భావిస్తే వైద్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు కైలీ. '65 ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఈ ఔషధం చుట్టూ ప్రస్తుతం కొన్ని అసత్య వాదనలు వస్తున్నాయి. ఈ మందు వినియోగం సురక్షితం కాదని కొందరు వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. అది మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు అడ్డుపడుతోంది.' అని తెలిపారు కైలీ.

అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం.. కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత హెచ్​సీక్యూ కరోనాపై ఎలాంటి సత్ఫలితాలు ఇస్తోందో తెలుపుతూ ట్రంప్​న​కు లేఖ రాశారు పలువురు భారత సంతతి వైద్యులు. అందులో కొందరు తాము కూడా ఈ మందును తీసుకుంటున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.