వాయవ్య చైనా షింజియాంగ్ రాష్ట్రంలోని కెకెటోహోయి మంచు దుప్పటి కప్పుకుంది. శ్వేతవర్ణంలో ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. వీటిని వీక్షించడానికి, పర్యటకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. సాంస్కృతిక అంశాలను మేళవించి పర్యటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెకెటోహోయిలోని ఫుయున్ కౌంటీలో ఓ రిసార్టులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
"ఎత్తైన ప్రదేశంలో ఈ రిసార్టు ఉండటం వల్ల ఎక్కువగా మంచు కురుస్తోంది. మిగతా రిసార్టుల్లాగా ఇక్కడ కృత్రిమమైన మంచు లేదు. స్కేటింగ్కు చాలా అనువుగా ఉంది."
--పర్యటకుడు
ఇదీ చూడండి:3 రోజుల్లో భూమిపైకి చంద్రుడి నమూనాలు!