ETV Bharat / international

ఈ అద్భుత సమాధానాలే ఆ భామలను 'విశ్వసుందరి'ని చేశాయ్​! - మిస్​ యూనివర్స్​

అందాల పోటీల్లో గెలుపొందాలంటే కేవలం సౌందర్యం ఒక్కటి ఉంటే సరిపోదు. ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కిరీటానికి అన్ని విధాలుగా అర్హత ఉన్న వారికే అందిస్తారు. అయితే అందులో వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ వేదికపై విశ్వసుందరి కిరీటాలను అందించిన అలాంటి ప్రశ్నలు- సమాధానాలు మీకోసం..

top-answers-which-fetched-the-crown-in-beauty-pageants
అతివలకు కిరీటాన్ని అందించిన సమాధానాలు...!
author img

By

Published : May 8, 2021, 5:46 PM IST

మిస్​ వరల్డ్​, మిస్​ యూనివర్స్​.. ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మక అవార్డులు ఇవి. ఈ పోటీల్లో గెలుపొందాలంటే.. కేవలం అందం ఒక్కటే కొలమానం కాదు. ఆయా పోటీల్లో అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు.. కిరీటానికి చేరువ చేస్తాయి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. మరి కొందరు విశ్వసుందరీ మణులు ఎదుర్కొన్న ప్రశ్నలు.. వాటికి వారు ఇచ్చిన సమాధానాలేంటో చూసేయండి...

సుస్మితా సేన్, భారత్​

ప్రపంచ సుందరి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓ సందర్భంలో 'భారత్​లో ప్రేమ అనేది జీవితంతో సమానం' అని సుస్మితా సేన్ అన్నారు.​ అలా ఎందుకన్నారని జ్యూరీ అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పారు. ఆ సమాధానమే.. సుస్మితకు కిరీటం దక్కేలా చేసింది.

top-answers-which-fetched-the-crown-in-beauty-pageants
సుస్మితా సేన్​

"భారత్​లో బహుళజాతి ప్రజలుంటారని అందరికి తెలుసు. ఎన్నో భాషలు, ఎన్నో మతాలు ఉన్నాయి. అయినా ప్రజలు కలిసి జీవిస్తారు. శాంతియుతంగా ఉంటారు. అనేక మతాల వారు కలిసి జీవిస్తున్నప్పటికీ శాంతియుతంగా ఉండటం చాలా కష్టం. అది ప్రేమతోనే సాధ్యం. అందుకే భారత్​లో ప్రేమ అనేది జీవితంతో సమానం అని నేను అన్నాను."

-- సుస్మితా సేన్​, మిస్​ యూనివర్స్​​- 1994

జోజిబిని తుంజి, దక్షిణాఫ్రికా

'నేటి తరం అమ్మాయిలకు ఏం నేర్పించాలి?' అని జ్యూరీ అడగ్గా.. తుంజి చెప్పిన సమాధానం అందరి మనసును దోచుకుంది.

top-answers-which-fetched- the crown-in-beauty-pageant
జోజిబిని తుంజి

"నా దృష్టిలో.. ఈ తరం అమ్మాయిలకు నాయకత్వం గురించి నేర్పించాలి. ఎంతో కాలంగా మహిళల్లో నాయకత్వం లోపించింది. మనం నాయకత్వం చేయలేక కాదు. సమాజం మహిళలను అలా చిత్రీకరించడమే కారణం. నాకు తెలిసి.. మహిళలు ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వారు. నేటి తరం అమ్మాయిలకు అది నేర్పించాలి. సమాజంలో మనకంటూ ఓ స్థానాన్ని నిర్మించుకోవడం ఎంతో ముఖ్యం."

--- జోజిబిని తుంజి, మిస్​ యూనివర్స్​- 2019

ఐశ్వర్య రాయ్​, భారత్​

'మిస్​ వరల్డ్​ 1994గా నిలవడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి?' అని ఐశ్వర్య రాయ్​ను అడిగింది జ్యూరీ. దానికి ఐష్​ చెప్పిన సమాధానం.. ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది.

ఐశ్వర్య రాయ్​

"ఇప్పటివరకు మిస్​ వరల్డ్​ అయినవారు.. తమలో కరుణ అనే భావానికి ప్రతీకగా నిలిచారు. అణగారిన వారిపట్ల కరుణతో ఉన్నారు. మనపై మనిషి ప్రయోగించిన ఆంక్షలు, జాతి, రంగుకు మించి చూశారు. వీటన్నింటికీ మించి మనం ముందుకు చూడాలి. అదే నిజమైన మిస్​ వరల్డ్​గా మన్నల్ని తీర్చిదిద్దుతుంది. ఎ ట్రూ పర్సన్​.. ఎ రియల్​ పర్సన్​."

--- ఐశ్వర్య రాయ్​, మిస్​ వరల్డ్​ 1994

వనెస్సా పోన్సే, మెక్సికో

'మీ పలుకుబడిని ఉపయోగించుకుని ప్రపంచానికి ఎలా సాయం చేస్తారు?' అని అడగ్గా.. పోన్సే ఈ విధంగా సమాధానం చెప్పారు. జ్యూరీ మన్ననలు పొంది.. ప్రపంచ సుందరిగా నిలిచారు.

వనెస్సా పోన్సే

"గత మూడేళ్లుగా చేస్తున్నట్టుగానే ఇప్పుడూ నా స్థాయిని ఉపయోగించుకుంటాను. ఆదర్శంగా నిలుస్తాను. ఈ ప్రపంచంలో.. మనం అందరం మంచికి చిహ్నంగా ఉండొచ్చు. అందరిని పట్టించుకోవాలి.. ప్రేమించాలి. ఇలా ఉండటం వల్ల అదనంగా ఖర్చు అవ్వదు. సహాయం చేయడం అంత కష్టమైనది కూడా కాదు. మార్పు తీసుకురావాలన్న ఆశయం ఉండాలి. మీరు ఇవ్వగలిగేది స్వీకరించేందుకు ఎవరో ఒకరు ఉంటారు. అందువల్ల.. ఎవరికైనా, ఏ విధంగానైనా సహాయం చేయండి."

--- వనెస్సా పోన్సే, మిస్​ వరల్డ్​- 2018

డయనా హైడెన్​, భారత్​

'మీరు మిస్​ వరల్డ్​ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు' అని డయానాను అడిగింది జ్యూరీ. అడిగారు. దానికి డయానా చెప్పిన

డయానా హైడెన్​

"ప్రముఖ రచయిత, కవి విలియమ్​ బట్లర్​ యేట్స్​ నాకు స్ఫూర్తి. 'కలలు బాధ్యతలకు పునాది' అని ఆయన రాశారు." ఆ స్ఫూర్తితో నేను ప్రపంచ సుందరి కావాలనుకుంటున్నాను.

--- డయానా హైడెన్​, మిస్​ వరల్డ్​- 1997

మానుషీ చిల్లర్​, భారత్​

"ప్రపంచంలో ఏ వృత్తికి ఎక్కువ జీతం ఇవ్వాలి"? అని మానుషీ చిల్లర్​ను అడిగారు జ్యూరీ సభ్యులు. ఆమె ఇచ్చిన సమాధానం అందరి మనసులను దోచుకుంది.

మానుషీ చిల్లర్​

"నేను మా అమ్మకు అత్యంత దగ్గరా ఉంటాను. ఎక్కువ గౌరవం పొందడానికి తల్లి అత్యంత అర్హురాలు. ఇక సాలరీ గురించి మాట్లాడితే.. అది కేవలం డబ్బుతో కూడిన వ్యవహారమని నేను అనుకోను. ఇతరులకు మనం ఇచ్చే ప్రేమ, గౌరవం అది. నా జీవితంలో నా తల్లి ఎంతో స్ఫూర్తినిచ్చింది. పిల్లల కోసం తల్లులు ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకే.. తల్లికే ఎక్కువ జీతం, ఎక్కువ గౌరవం, ఎక్కువ ప్రేమ దక్కాలి."

--- మానుషీ చిల్లర్​, మిస్​ వరల్డ్​ 2017

యుక్త మూఖేయ్​, భారత్​

'ఓ ఆడబిడ్డగా.. తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తావు?' అనే ప్రశ్నకు మూఖేయా ఇలా సమాధానం చెప్పారు. ప్రపంచ సుందరి పోటీల్లో విజయం సాధించారు.

యుక్త మూఖేయ్​

"మీరు నాకు నేర్పించిన విలువలతో.. నేను మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాను. ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలబడాలని ఆశిస్తున్నా. అప్పుడే కుటుంబం విలువ, నీతి అంటే ఏంటో అందరికి తెలుస్తుంది."

--- యుక్త ముఖేయ్​, మిస్​ వరల్డ్​-1999

నటాలియా గ్లేవోబా, కెనడా

'మీ జీవితంలో అతిపెద్ద సవాలు ఏంటి' అని నటాలియాను ప్రశ్నించారు జ్యూరీ సభ్యులు. దాని ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

నటాలియా గ్లెవోబా

"పాజిటివ్​గా ఉండేందుకు ప్రయత్నించడమే నా జీవితంలో పెద్ద సవాలు. ఓ గ్లాసును 'హాఫ్​ ఎంప్టీ'గా కాకుండా.. 'హాఫ్​ ఫుల్'​గా చూసే మనిషిని నేను. కొన్ని సార్లు అది చాలా కష్టం. పాజిటివ్​గా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటా."

-- నటాలియా గ్లేవోబా, మిస్​ యూనివర్స్​-2005

లారా దత్తా, భారత్​

అందాల పోటీలు మహిళలకు అగౌరవాన్ని తెస్తాయని అప్పట్లో నిరసనలు చెలరేగాయి. దానిపైన లారా దత్తా స్పందనను అడిగారు నిర్వాహకులు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం.. అందరి మనసులను దోచుకుంది.

లారా దత్తా

"నా వరకు.. మనకి నచ్చిన దాంట్లో ఎదగడానికి ఉపయోగపడే వేదిక ఈ మిస్​ యూనివర్స్​ పోటీ. వ్యాపారంలో, సాయుధ దళంలో, రాజకీయాల్లో ముందడుగు వేయవచ్చు. మన ఛాయిస్​, భావాలు వ్యక్తపరిచే వేదిక ఇది. ఇది మనల్ని మరింత శక్తివంతమంతంగా మారుస్తుంది. స్వతంత్రంగా ఉండేలా చేస్తుంది."

--- లారా దత్తా, మిస్​ యూనివర్స్​-2000

ఇదీ చూడండి:- 'పాప్​కార్న్​ సలాడ్'.. ఇదేం ఐడియా తల్లీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.