ETV Bharat / international

మెక్సికోలో మూడో దశ- టోక్యోలోనూ కలకలం! - మెక్సికోలో మూడోదశ

ఈ నెల 23వ తేదీ నుంచి ఒలింపిక్​ గేమ్స్​ ప్రారంభమవుతుండగా.. టోక్యోలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. దీంతో ఒలింపిక్​ నిర్వాహకుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నా.. ఫలించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

Tokyo records most virus cases
టోక్యోలో పెరిగిన కరోనా కేసులు
author img

By

Published : Jul 10, 2021, 6:49 PM IST

Updated : Jul 11, 2021, 1:43 PM IST

సమ్మర్​ ఒలింపిక్స్​కు మరికొద్ది రోజులు ఉందనగా.. జపాన్​లోని టోక్యోలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్కరోజులో 950 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండు నెలలకాలంలో ఒక్కరోజు ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఈ స్థాయిలో కొవిడ్​ వ్యాప్తి చెందడం ఒలింపిక్​ నిర్వాహకులను కలవరపెడుతోంది.

ప్రపంచస్థాయి ఒలింపిక్​ గేమ్స్​ నిర్వహణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కరోనా ప్రబలకుండా ఉండేందుకు గాను అక్కడి ప్రధాని యోషిహిదే సుగా.. గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి రానుండగా.. పెద్ద సంఖ్యలో కరోనా కొత్త కేసులు వెలుగు చూడడం ఇటు క్రీడాకారులను, నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ఈసారి ఫ్యాన్స్​ లేకుండానే ఒలింపిక్స్​ నిర్వహించేందుకు సిద్ధమైంది జపాన్​ ప్రభుత్వం.

రష్యాలో పెరుగుతున్న మరణాలు...

ప్రపంచవ్యాప్తంగానూ కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రష్యాలో వైరస్​తో మరణించే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్తగా 752 మంది చనిపోయినట్లు రష్యా న్యూస్​ ఏజెన్సీ టాస్​ తెలిపింది. దీంతో మొత్తం మరణాలు 1,42,253 కు చేరాయి. ఒక్కరోజే 25,082 మందికి కరోనా సోకింది.

మెక్సికోలో మూడోదశ..!

మెక్సికోలో కరోనా మూడోదశ ప్రారంభమైంది. గతవారంతో పోల్చితే కేసుల సంఖ్య 29 శాతం పెరిగింది. యువతలో వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: Olympics: ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్​

Last Updated : Jul 11, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.