ETV Bharat / international

ఏయ్​.. ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్​..!

ఉదయం లేవగానే ఓ కప్పు ఛాయ్​ తాగందే మనసు కుదుటపడదు. ఇక చిరాకు కలిగితే ఉపశమనం కలిగించేది కూడా తేనీరే. నేడు అంతర్జాతీయ తేనీటి దినోత్సవం. ఈ సందర్భంగా తేనీరుపై ఓ లుక్కేద్దాం.

TODAY INTERNATIONAL TEA DAY A SPECIAL STORY ON THIS TOPIC
ఏ ఛాయ్​ చమక్కులే చూడరా భాయ్​
author img

By

Published : Dec 15, 2019, 1:19 PM IST

దేశంలో ఆర్థిక పరమైన తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరిచే శక్తి తేనీటికి మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి అద్భుత శక్తి కలిగిన తేనీటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు, ప్రత్యేక గౌరవం కలిగించేందుకు ప్రతి ఏటా డిసెంబరు నెల 15వ తేదీని అంతర్జాతీయ తేనీటి దినోత్సవంగా పరిగణిస్తుంటారు.

ఛాయ్‌ వాలాగా జీవనం ప్రస్తావనం ప్రారంభించిన నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఎంపికయ్యే ముందు దేశవ్యాప్తంగా ఛాయ్‌పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా విశేషాదరణ పొందింది. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయగాధ కన్నా విశేషమైన విశేషమేమిటంటే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అటక్‌ నుంచి కటక్‌ వరకు దేశ ప్రజలందరిని ఆహ్లాదపరిచిన అంశం చర్చతో పాటు ఛాయ్‌ తాగడం దేశ ప్రజల్లో తాగునీరు తరువాత ప్రజలందరూ ఎక్కువ తాగేది తేనీరు మాత్రమే.

పరిచయం పెంచుకోవడానికి..

కొంత కాలం క్రితం తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన విజయవంతమైన చిత్రంలో కథానాయిక ఇంటికి కథానాయకుడి బృందం వెళుతుంది. ఎందుకంటే పరిచయాలు పెంచుకోవడానికి అంటూ చెబుతుంటారు. ఈ విధంగా పరిచయాలు పెంచుకోవడంలో తేనీరు కీలక పాత్ర పోషిస్తుంది.

రోజూ ప్రతి సమయంలోనూ తేనీటిదే కీలక పాత్ర. నిద్రలేచిన తరువాత తొలుత తేనీటిని తాగనిదే రోజు ప్రారంభం కాదు. చలికాలంలో వెచ్చదనాన్ని, వర్షాకాలంలో ఆహ్లాదాన్ని ఆస్వాదించాలంటే నాలుకపై వేడి వేడి తేనీటి చుక్క పడాల్సిందే. మనస్సు ఆనందంతో ఓలలాడాల్సిందే. ఆనందమైనా, ఆవేదనయినా, ఆందోళనైనా, ఆలోచనకైనా తేనీరు తాగడం ప్రతి ఒక్కరికీ అలవాటు. విసుగు చెందినా, విరామం కోరుకున్నా, వెన్నెల్లో హాయిగా ఆనందం పంచుకోవాలన్నా తేనీరు తోడు ఉండాల్సిందే. స్నేహితులు, సన్నిహితులకు తోడు తేనీరు పన్నీరులాగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

ఎన్ని రకాల 'టీ'లో...

తొలుత గ్రామీణ ప్రాంతాల్లో తేయాకు పొడిని వేడినీళ్లలో ఉడికించి డికాక్షన్‌ తయారు చేసుకుని, ఇందులో పాలు, చక్కెర కలుపుకొని తేనీటిని ప్రజలు తాగేవారు. తరువాత దీనిస్థానంలో తేయాకు పొడిని పెద్ద మొత్తంలో ఒకే సారి ఉడికించి, ఆ తరువాత అవసరమైనప్పుడు పాలు చక్కెర కలిపి ఇచ్చేవారు. దీన్ని ధమ్‌ టీగా పిలిచేవారు. అయితే ఇప్పుడు పట్టణ ప్రాంతాల మాదిరిగా వివిధ రకాలుగా తేనీరు తయారీ జరుగుతుండటం విశేషం. ఇరానీ టీ, లెమన్‌ టీ, మసాలా టీ, బాదం టీ, కోకో టీ, గులాబీ టీ , చామంతి టీ, జింజర్‌ టీ, పుదీనా టీ, అల్లంటీ, తులసీ టీ, బట్టర్‌ టీ వంటికి అందుబాటులోకి వచ్చాయి. వీటికి చెందిన పొడులు అందుబాటులో ఉన్నందున ప్రతీ ఒక్కరు వివిధ రకాల రుచులు, రంగులు, వాసనలు కలిగిన టీ తాగుతున్నారు.

జిల్లా కేంద్రంలో పరిశీలిస్తే..

నెల్లూరు నగరంలో నాటి నుంచి నేటి వరకు వర్తమాన రాజకీయాలు, సామాజిక రంగంలో జరిగే పలు మార్పుల గురించి ట్రంకు రోడ్డులోని ప్రముఖమైన ఛాయ్‌ విక్రయించే దుకాణం వద్ద నుంచే ప్రారంభమవుతుంటాయి.

ఇప్పుడు గ్రీన్‌ టీదే హవా

ప్రస్తుతం అందరూ వివిధ రకాల టీ తాగినా గ్రీన్‌ టీ తాగడానికి ప్రాధాన్యం పెంచుతున్నారు. ఆరోగ్యంగా ఉంటుందని గ్రీన్‌ టీ సేవిస్తున్నారు. పాలు , చక్కెర లేకుండా సేవించే గ్రీన్‌ టీలో పలు రకాల ఉపయోగాలున్నాయి. గ్రీన్‌ టీని రోజులో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సేవించేందుకు వీలవుతుంది. రాత్రి నిద్రకు ఒక గంట ముందుగా గ్రీన్‌ టీ సేవిస్తే నిద్రించే సమయంలోను శరీరంలో కొవ్వు కరిగిస్తుందని, ఫలితంగా బరువు తగ్గుతున్నట్లు గ్రీన్‌ టీ ప్రియులు నమ్ముతున్నారు. దీంతో పాటు జలుబు, దగ్గు, వంటి శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. గ్రీన్‌ టీలో కాటెచిన్‌ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లున్నందున, ఇవి శరీరంలో అంతర్గతంగా ఉన్న సమస్యలను దూరం చేసేందుకు ఉపకరిస్తాయి. నిద్రపోయే ముందు గ్రీన్‌ టీ తాగితే ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా నిద్రించేందుకు వీలవుతుంది. మరుసటి రోజు నిద్రలేచే సరికి ఉల్లాసంగా ఉంటుంది.

ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన టీలు

టీలతో పాటు ప్రపంచంలో వివిధ రకాల టీ పొడులు ప్రాచుర్యంలో ఉన్నాయి. తేనీటి ప్రియులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

మాచా టీ : ఇది జపాన్‌ దేశంలో పేరు పొందిన టీ. తేయకులను సూర్యకాంతి, ఆక్సిజన్‌ తగలకుండా చేసి మెత్తని పొడి లా చేసి వినియోగిస్తారు. ఈ తేనీరు ఆకుపచ్చగా ఉంటుంది. వైట్‌ టీ : పూర్తిగా విచ్చుకోని లేలేత తేయాకు చిగుళ్లను ఏమాత్రం శుభ్రం చేయకుండా ఎండబెట్టిన తరువాత అవి పాలిపోయినట్లుగా తయారవుతాయి. వీటితో తేనీటిని తయారు చేస్తే రంగు ఉండదు. ఇందువలన ఇది వైట్‌ టీగా పిలువబడుతుంది.

ఎల్లో టీ : ప్రపంచంలో కేవలం చైనా దేశంలోని హూసన్‌, జెజియాంగ్‌, సిచువాన్‌ కొండల మీద పండించే తేయాకుతో మాత్రమే ఎల్లో టీ తయారు చేస్తారు. తేయాకును నేరుగా ఎండబెట్టకుండా, ఆక్సీకరణం చెందించుతూ ఎండ బెడతారు. తేయాకుతో సంబంధం లేని రెడ్‌టీ : దక్షిణాఫ్రికాలో రాయ్‌బస్‌ అనే మొక్కల ఆకులను ఎండ బెట్టి తయారు చేసే టీని రెడ్‌ టీ అంటారు.

AP Video Delivery Log - 0600 GMT News
Sunday, 15 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0549: Japan Olympic Stadium AP Clients Only 4244832
Tokyo's new Olympic stadium completed
AP-APTN-0433: China Mine Accident No access mainland China 4244827
4 miners dead, 14 trapped in China mine accident
AP-APTN-0418: Australia Emergency Landing No access Australia 4244826
Plane makes emergency landing in Sydney
AP-APTN-0402: Brazil Christmas Tree AP Clients Only 4244825
Giant Christmas tree lit up in Rio lake
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.