ETV Bharat / international

'చైనా వెనక్కి తగ్గినా.. భారత్​ అప్రమత్తంగానే ఉండాలి' - టిబెట్​ చైనా

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాల ఉపసంహరణను టిబెట్​ యువజన కాంగ్రెస్​ స్వాగతించింది. ఈ మేరకు భారత సైన్యం, ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. అయితే చైనా మళ్లీ చొరబడొచ్చని.. ఈ వ్యవహారంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Tibetan Youth Congress slams China, cheers for Indian Army
'చైనా వెనక్కి తగ్గినా.. భారత్​ అప్రమత్తంగానే ఉండాలి'
author img

By

Published : Jul 7, 2020, 8:14 AM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా భారత సైన్యం, ప్రభుత్వంపై టిబెట్​ యువజన కాంగ్రెస్​ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణను స్వాగతించారు. అయితే చైనాను నమ్మలేమని.. భారత్​ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

"చైనా దళాలు రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గాయి. ఈ విషయంపై భారత్​ను ప్రశంసించాలి. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. చైనా మళ్లీ చొరబడవచ్చు. అందుకే చైనాతో జాగ్రత్తగా ఉండాలి. భారత్​-చైనా మధ్య టిబెట్​ సమస్యాత్మక ప్రాంతాంగా ఉన్నంత కాలం ఈ వ్యవహారానికి పరిష్కారం లభించదు."

-- సోనమ్​ సిరింగ్​, టీవైసీ ప్రధాన కార్యదర్శి.

"భారత్​ మాతా కీ జై","చైనా ఫ్రీ​ టిబెట్​","గో బ్యాక్​ చైనా" అంటూ నినాదాలు చేశారు టిబెట్​ యువత.

చైనా యాప్స్​ను భారత్​ నిషేధించడాన్ని స్వాగతించారు యువత. చైనాకు వ్యతిరేకంగా భారత్​ ఏ నిర్ణయం తీసుకున్నా.. తమ మద్దతు ఉంటుందని యువజన కాంగ్రెస్​ సభ్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.