ETV Bharat / international

hog hotel : 13 అంతస్తుల హోటల్‌లో 10వేల పందులు! - హాగ్​ హోటల్​ చైనా

ఆఫ్రికన్​ స్వైన్​ఫ్లూ బారి నుంచి కాపాడుకోవడం కోసం చైనా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దక్షిణ చైనాలోని ఓ హాటల్​లో 10వేల పందులను క్వారంటైన్​లో ఉంచి పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాదిలో స్వైన్‌ఫ్లూ సోకిందన్న అనుమానంతో 2వేలకు పైగా పందుల్ని వధించింది.

african swine flu china
ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూపై చైనా
author img

By

Published : Aug 3, 2021, 10:46 PM IST

చైనాలో కరోనా వైరస్‌ ప్రబలగానే అక్కడి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేసి, ప్రజలను బలవంతంగానైనా క్వారంటైన్‌ చేసి నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వ సిబ్బందే తెచ్చిపెట్టేలా ఏర్పాట్లు చేసింది. ఈ విధంగానే తాజాగా దక్షిణ చైనాలో 10వేల పందులను 13 అంతస్తుల హాగ్​ హోటల్‌లో (hog hotel) క్వారంటైన్‌లో ఉంచి.. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోంది. పోషకాహారం పెట్టి పెంచుతోంది. సీసీ కెమెరాలు పెట్టి.. పశువైద్యులను అందబాటులో ఉంచింది. ఇదంతా చేసింది పందులను ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ బారి నుంచి కాపాడుకోవడం కోసమే.

కరోనా వైరస్‌ కంటే ముందు 2018లో చైనాలో పందులకు ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ సోకింది. ఎబోలా వైరస్‌ మనుషుల ప్రాణాలు ఏ విధంగా తీస్తుందో.. ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ కూడా పందుల్ని అలాగే చంపేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఏడాదిలో దేశ వ్యాప్తంగా 40కోట్ల పందులను వధించారు. వైరస్‌ జాడ కనుమరుగైనా.. అప్పుడప్పుడు ఈ వైరస్‌ ఉనికిపై అనుమానాలు వ్యక్తం అయ్యేవి. ఈ ఏడాదిలోనూ స్వైన్‌ఫ్లూ సోకిందన్న అనుమానంతో 2వేలకు పైగా పందుల్ని చంపేశారు.

కాగా.. పందుల్లో స్వైన్‌ఫ్లూ లక్షణాలు పెద్దగా కనిపించవు. వీటి ఇంక్యూబేషన్‌ సమయం కూడా చాలా ఎక్కువ. దీంతో పందుల్లో స్వైన్‌ఫ్లూను గుర్తించడం కష్టతరంగా మారుతుంది. మరోవైపు దేశంలో కోట్ల సంఖ్యలో పందుల్ని వధించడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోయింది. దీంతో పంది మాంసానికి డిమాండ్‌ పెరిగి.. ధరలు ఆకాశనంటుతున్నాయి. ఈ రెండు విషయాలను దృష్టి ఉంచుకొని చైనా ప్రభుత్వం పది వేల పందుల్ని ఎంపిక చేసి 13 అంతస్తుల భవంతిలో క్వారంటైన్‌ చేసింది. వాటికి స్వైన్‌ఫ్లూ మాత్రమే కాదు.. ఇతర ఏ వైరస్‌లు సోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ.. ఆరోగ్యంగా ఉండే పందుల్ని మార్కెట్లోకి పంపించేడమే లక్ష్యంగా ఈ అధికారులు ఈ ఏర్పాటు చేశారు. వాటికి పౌష్టికాహారం పెడుతూ.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి : వుహాన్‌లో మళ్లీ కలకలం- కోటి మందికి కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.