ఇంద్ర జాత్రా ఉత్సవాలను నేపాల్లోని హిందువులు, బౌద్ధులు కలిసి నిర్వహిస్తారు. పురాతన కాలం నుంచి నెవార్ జాతికి చెందిన ఓ యువతిని కుమారి (దేవత)గా కొలుస్తారు. ఆమెను రథంలో కూర్చోబెట్టి కాఠ్మాండు వీధుల్లో ఊరేగిస్తారు.
వర్షాకాలం ముగిసే సమయంలో ప్రతి ఏటా ఈ ఇంద్ర జాత్రా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకతో అక్కడ పండుగలు మొదలవుతాయి.
ఇదీ చూడండి: చైనా: 'మిడ్ ఆటమ్' వేడుక.. సంప్రదాయాల కలయిక