పాత కాలం నాటి ట్రామ్‌ల ప్రదర్శనకు రష్యా రాజధాని మాస్కో వేదికైంది. గుర్రాలతో లాగే ట్రామ్ నుంచి ఎలక్ర్టికల్ ట్రామ్ వరకు... అన్ని రకాల వాహనాలను ఇక్కడ వీక్షంచవచ్చు. చరిత్రను భద్రపరిచే ఉద్దేశంతో మాస్కో రవాణా సంస్థ వీటన్నింటినీ 1990 నుంచి సేకరించింది.
1872 జులై 7న మొదటిసారి గుర్రాలు లాగే ట్రామ్‌ను రవాణా వ్యవస్థకు వినియోగించారు. పట్టాల మధ్య గుర్రాలు నడుస్తూ... ప్రయాణికుల బోగీని లాక్కెళ్తాయి. ఆ తర్వాత ఎలక్ర్టిక్ ట్రామ్‌లు అందుబాటులోకి వచ్చాయి.
"మొదట్లో ట్రామ్స్‌ను వినోదంకోసమే రూపొందించారు. సైనిక విభాగం 4 కిలోమీటర్లుపైగా పట్టాలు వేసి ట్రామ్‌లను నడిపింది. మాస్కో పౌరులు దీనిని కేవలం వినోదం కోసమనే కాకుండా రవాణా రంగానికి ఉపయోగించడాన్ని ఇష్టపడ్డారు."
- జెన్నడీ మేరికో, మాస్కో రవాణా సంస్థ మ్యూజియం నిర్వాహకుడు
ప్రదర్శనలో ఉన్నవాటిలో స్నో ట్రామ్ ప్రత్యేకం. 1990లో రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న మంచును తొలగించడానికి ఈ ట్రామ్‌ను ప్రవేశపెట్టారు.
కొన్ని ట్రామ్స్ అయితే సినిమాలో కనిపించి సెలబ్రిటీలుగా మారాయి. 1930లో రూపొందించిన ఒక ట్రామ్ 1987లో ఎంతో పేరు పొందిన సోవియట్ చిత్రాలలో కనిపించి, మంచి గుర్తింపు పొందింది.
"సెయింట్ పీటర్స్బర్గ్ కంపెనీ రవాణా వ్యవస్థలో ప్రవేశపెట్టిన లయన్ ట్రామ్ కూడా ఈ ప్రదర్శనకు ఆకర్షణగా నిలిచింది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రామ్‌కు రెండువైపులా తలుపులు ఉంటాయి. రెండు క్యాబిన్లు ఉంటాయి. కాబట్టి వృత్తాకార మార్గం అవసరం లేదు. ఇది చాలా పెద్ద ట్రామ్. ఈ ట్రామ్ పొడవు 34 మీటర్లు."-పావెల్ కుడ్రియాషోవ్, డ్రైవర్
1899 ఏప్రిల్ 7న మొట్టమొదటి సారి ఎలక్ర్టిక్ ట్రామ్‌ను ప్రవేశపెట్టారు. అందుకు ప్రతీకగా ఏటా అదే రోజు ట్రామ్ ప్రదర్శన ప్రారంభం అవువుంది. ప్రజాదరణ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఇదీ చూడండి: పొలం దున్ని నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చిత్రం గీశాడు!