ETV Bharat / international

కొవిడ్​ పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరిన జనం - కరోనా వివరాలు

థాయ్​లాండ్​పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవటం వల్ల.. భయంతో పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఈ క్రమంలో ఒక్కో కేంద్రం వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.

Thailand virus outbreak
థాయ్​లాండ్​పై కరోనా మహమ్మారి పంజా
author img

By

Published : Dec 20, 2020, 9:59 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్న తరుణంలో వైరస్​ను కట్టడి చేయగలిగిన థాయ్​లాండ్​లో.. ఒక్కసారిగా భారీగా కేసులు వెలుగు చూశాయి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవటం వల్ల.. ప్రజలు భయంతో పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారి వేలాది మంది పరీక్షా కేంద్రాలకు చేరుకోవటం వల్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్​ మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు.

కొవిడ్​ పరీక్షా కేంద్రల ముందు బారులుతీరిన జనం

సముత్​ సాఖోన్​ రాష్ట్రం మహచాయ్​లోని పరీక్ష కేంద్రం వద్ద మూడు వరుసల్లో 100 మీటర్ల మేర బారులు తీరారు జనం. అందులో ప్రధానంగా వలస కార్మికులే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ఆ రాష్ట్ర​ గవర్నర్​ రాత్రి కర్ఫ్యూ, ప్రయాణాలపై జనవరి 3 వరకు ఆంక్షలు విధించారు. షాపింగ్ ​మాల్స్​, పాఠశాలలు, సినిమాహాళ్లు, స్పా కేంద్రాలు, క్రీడామైదానాలు మూసివేయాలని ఆదేశించారు.

కొత్త వైరస్​ క్లస్టర్​ సీఫుడ్​ మార్కెట్​-క్లాంగ్​ కూంగ్​తో పాటు దాని అనుబంధ కాలనీలను మూసివేశారు పోలీసులు. ఈ మార్కెట్​లోనే 141 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ విపత్తు నియంత్రణ విభాగం తెలిపింది. శనివారం ఒక్కరోజే.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 548 కేసులు నమోదయ్యాయి. రోజు వారి కేసుల్లో ఇదే అత్యధికం.

థాయ్​లాండ్​లో ఇప్పటి వరకు మొత్తం 5,000 కేసులు నమోదయ్యాయి. 60 మంది మరణించారు. నాలుగు వేల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​లో కరోనా టీకా పంపిణీ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.