అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర అఫ్ఘాన్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడికి పాల్పాడ్డారు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని అఫ్ఘాన్ ప్రధాన మంత్రి అశ్రఫ్ ఘని తాలిబన్లను కోరారు. ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఉత్తర కాబుల్‌కు 250 కిలో మీటర్ల దూరంలోని పుల్-ఐ-ఖుమ్రిలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై మొదట భారీ పేలుడు సంభవించింది. తేరుకునే లోపే కాల్పులకు తెగపడ్డారు తాలిబన్లు.
ఈ దాడిలో 13 మంది పోలీసు అధికారులు మృతి చెందగా.. 35 మందికి గాయలయినట్లు అఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. దాడిని ప్రతిఘటించిన పోలీసులు 8 మంది తాలిబన్లను మట్టుబెట్టారని పేర్కొంది. ఈ కాల్పుల్లో 20 మంది పౌరులకు గాయలయినట్లు తెలిపింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: ల్యాండింగ్ చేస్తుండగా విమానంలో మంటలు