ETV Bharat / international

Kabul airport: తాలిబన్ల టెస్ట్ పాసైతేనే ఎయిర్​పోర్ట్​లోకి ఎంట్రీ! - అఫ్గాన్​

అఫ్గాన్​ను విడిచేందుకు కాబుల్​ విమానాశ్రయానికి(kabul airport) పోటెత్తుతున్న ప్రజలకు అక్కడ కూడా అగ్నిపరీక్ష తప్పడం లేదు. విమానాశ్రయం చుట్టూ తాలిబన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎయిర్​పోర్ట్ లోపల సైనికులు శరణార్థుల జాబితాను రూపొందిస్తుంటే.. బయట ఏర్పాటు చేసిన స్క్రీనింగ్​ పరీక్షలను తాలిబన్​ ఫైటర్లు(taliban news) పరిశీలిస్తున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు యత్నిస్తున్న ప్రతి ఒక్కరినీ నిశితంగా గమనిస్తున్నారు. తాలిబన్లు తమకు సహకరిస్తున్నారని సైన్యం చెబుతున్నా.. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

taliban
తాలిబన్​
author img

By

Published : Aug 23, 2021, 3:41 PM IST

Updated : Aug 23, 2021, 5:04 PM IST

కాబుల్​ విమానాశ్రయంలో..

కాబుల్​​ విమానాశ్రయం(kabul airport news)లో తాలిబన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాబుల్​ ఆక్రమణ అనంతరం ఎయిర్​పోర్ట్​లో నెలకొన్న పరిస్థితులను అదుపు చేసేందుకు.. అక్కడే ఉన్న అమెరికా, బ్రిటన్​ సైనికులకు వీరు సహాయం అందిస్తున్నారు. ఓవైపు శరణార్థులకు సంబంధించిన పత్రాలను సైనికులు సరిచూస్తుంటే.. మరోవైపు ఎయిర్​పోర్టు బయట ఏర్పాటు చేసిన స్క్రీనింగ్​ పరీక్షలను తాలిబన్​ ఫైటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.

అయితే తాలిబన్ల(taliban news) చూపులు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిని అనుమతిస్తారో, ఏ సమయంలో ఎవరిని అడ్డుకుంటారోనని భయపడిపోతున్నారు. ఒక్కోసారి.. తాలిబన్​ ఫైటర్లు తుపాకులతో కొడుతుండటం, చేతికందిన దానిని విసురుతుండటం చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొన్నేళ్లుగా అధ్యక్షుడు ఘనీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారు.. తాలిబన్లను చూసి గడగడలాడుతున్నారు.

taliban
విమానాశ్రయం వద్ద తాలిబన్లు

తాలిబన్లు సైనికులకు సహకరిస్తుండటం చూసి తామే అశ్చర్యపోయామని బిటీష్​ సైన్యానికి చెందిన లుటినెంట్​ కల్నల్​​ విల్​ హంట్​ తెలిపారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాలిబన్లు కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.

అమెరికా దళాల ఉపసంహరణ పూర్తికాకముందే.. మెరుపువేగంతో దేశాన్ని ఆక్రమించుకున్నారు తాలిబన్లు(Afghanistan latest news). గత ఆదివారం కాబుల్​పై తమ జెండా ఎగరేశారు. వారి వేగానికి ప్రపంచదేశాలు షాక్​కు గురయ్యాయి. అనంతరం తాలిబన్ల చెర నుంచి విముక్తి పొందేందుకు అక్కడి ప్రజలు కాబుల్​ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పదుల సంఖ్యలో అఫ్గాన్​వాసులు ప్రాణాలు కోల్పోయారు. వారం రోజులు గడిచినా అక్కడ రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

ఇవీ చూడండి:-

Last Updated : Aug 23, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.