ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్నిపర్వతం బద్ధలైంది. లావా భారీగా ఎగసిపడుతోంది. సంబంధిత టైమ్‌లాప్స్ ఫుటేజీని విడుదల చేసింది ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనోలజీ అండ్ సెసిమాలజీ(ఫివోల్క్స్) సంస్థ. తాజాగా.. తాల్ వాల్కనో అకస్మాత్తుగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
లావా కారణంగా 100 కిలోమీటర్ల మేర బూడిద, రాళ్లు ఆకాశంలోకి చిమ్ముకొచ్చాయి. ఈ నేపథ్యంలో మనీలా అంతర్జాతీయ విమానశ్రయాన్ని మూసేశారు. ఫలితంగా 240 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. త్వరలో మరో భారీ విస్ఫోటం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అగ్నిపర్వత- పర్యవేక్షణ సంస్థ భావిస్తోంది. ప్రమాదం పొంచి ఉన్నందున సమీప గ్రామాల్లోని 8 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ప్రభుత్వం.
మెరుపులతో లావా ఉగ్రరూపం..
మరోవైపు టాగెట్టే నగరంలో తాల్ అగ్ని పర్వతం విస్ఫోటం సమయంలో.. భూమి నుంచి మెరుపులు ఉద్భవించాయి. ఆదివారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో మేఘాలు, మెరుపులతో లావా ఉగ్రరూపం దాల్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అధికారిక మీడియా విడుదల చేసింది.
ఇదీ చూడండి : 'శబరిమల 'రివ్యూ' పిటిషన్లను విచారించట్లేదు'