ETV Bharat / international

రూ.23లక్షల విలువైన బైక్​కు నిప్పు- అసలేం జరిగింది? - thailand news

ప్రేమ చాలా గమ్మత్తైనది. ఇద్దరి మనసులను ముడిపెట్టే ప్రేమ.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. తాజాగా థాయ్​లాండ్​లో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. మాజీ ప్రియుడిపై కోపంతో ఓ యువతి రూ. లక్ష కాదు.. రూ. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 23 లక్షల బైక్​ను తగలబెట్టింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

thailand girl set bike on fire
మాజీ ప్రియుడి బైక్​కు నిప్పు
author img

By

Published : Jun 29, 2021, 12:39 PM IST

మాజీ ప్రియుడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది థాయ్​లాండ్​కు చెందిన 36 ఏళ్ల ఓ మహిళ. పక్కా స్కెచ్​ వేసింది. అతడు.. పార్క్​ చేసిన బైక్​ను తగలపెట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే.. ఆ బైక్​ ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అక్షరాలా 23 లక్షల రూపాయలు.

తనకు ప్రియుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఖరీదైన బైక్​ అది. బ్రేకప్​ అయ్యాక మళ్లీ తనకు అతడు బైక్​ తిరిగివ్వలేదన్న కోపంతో పెట్రోల్​ పోసి నిప్పు అంటించింది ఆ​ మహిళ. ​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎలా చేసిందంటే?

బ్యాంకాక్​లో తన మాజీ ప్రియుడు పనిచేసేచోటుకు కారులో వచ్చింది ఆమె. మెల్లగా.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్​ ఆ బైక్​పై పోసి తగలబెట్టింది. ఆమెకు కూడా మంటలు అంటుకున్నా అక్కడి నుంచి తప్పించుకుంది. పక్కనే పార్క్​ చేసి ఉన్న మరో ఆరు ద్విచక్రవాహనాలు కూడా పూర్తిగా కాలిపోయాయి.

thailand girl set bike on fire
బైక్​పై పెట్రోల్​ పోస్తున్న యువతి

ఈ ఘటనను స్థానిక పోలీసులు నిర్ధరించారు. పక్కనే స్కూల్​ ఉన్నప్పటికీ.. ఆన్​లైన్​ క్లాసుల వల్ల ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రేమలో ఉన్నప్పుడు.. ఆ యువతి తన బాయ్​ఫ్రెండ్​కు గిఫ్ట్​గా ఆ 23 లక్షల విలువైన బైక్​ను ఇచ్చిందని, ఇప్పుడు తిరిగివ్వనందుకు ప్రతీకారంగా చేసినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆమెపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ప్రియుడు.. ప్రియురాలు.. 2 ఉంగరాలు!

శృంగారంలో 'అపశృతి'- ప్రియుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.