రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో థాయ్‌లాండ్ అతలాకుతలమయింది. వరదల ధాటికి ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు 20,000 మంది వరద బాధితులు విపత్తు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
ఆగస్టు చివరి వారంలో కురిసిన కుండపోత వర్షానికి థాయ్‌లాండ్‌లోని 32కి పైగా రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. నాటి విపత్తుకు 33 మంది బలయ్యారు.
ఇదీ చూడండి : జనరల్ మోటార్స్ కార్మికుల సమ్మె బాట