ETV Bharat / international

తాలిబన్ల కొత్త ఆత్మాహుతి దళం - తాలిబన్​ వార్తలు

తాలిబన్లు (Taliban News) కొత్తగా ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసినట్లు అఫ్గానిస్థాన్​లో బదాక్షన్​ ప్రావిన్స్​ గవర్నర్ ముల్లా సిసార్​ అహ్మద్​ అహ్మదీ తెలిపారు. వీరు ముఖ్యంగా చైనా, తజకిస్థాన్​ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ​

suicide bombers to Afghanistan's borders
తాలిబన్ల కొత్త ఆత్మాహుతి దళం
author img

By

Published : Oct 3, 2021, 6:54 AM IST

అఫ్గానిస్థాన్​లోని తాలిబన్‌ (Taliban News) సంస్థ కొత్త ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసింది! దీని పేరు లష్కర్‌-ఎ-మన్సూరీ (మన్సూర్‌ ఆర్మీ) అఫ్గాన్​ సరిహద్దుల్లో.. ముఖ్యంగా తజికిస్థాన్​, చైనా సరిహద్దుల్లోని బదాక్షన్‌ ప్రావిన్స్‌లో ఈ దళ సభ్యులను మోహరిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను బదాక్షన్‌ గవర్నర్‌ ముల్లా నిసార్‌ అహ్మద్‌ అహ్మదీ శనివారం మీడియాకు వెల్లడించారు.

'సరిహద్దుల్లో మోహరించేందుకు తాలిబన్‌ సంస్థ ఈ దళాన్ని సిద్ధం చేసింది. ఇందులో ప్రతి ఒక్కరూ చాలా ధైర్యవంతులు. గత అఫ్గాన్​ ప్రభుత్వ సైన్యాన్ని గడగడలాడించిన దళ సభ్యుల మాదిరే వీరూ పనిచేస్తారు. నిజానికి... వీళ్లు లేకుంటే అమెరికా ఓటమి సాధ్యమయ్యేదే కాదు. 'బద్రి+18' పేరుతో మరో బెటాలియన్‌ను కాబుల్‌ విమానాశ్రయం వద్ద మోహరించారు. ఈ దళం వద్ద అత్యాధునిక సైనిక ఆయుధాలు ఉన్నాయి' అని అహ్మదీ వెల్లడించారు.

ఇదీ చూడండి: UK Fuel Crisis: ఇంధన కొరతను తీర్చేందుకు ఆర్మీ రంగంలోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.