అఫ్గానిస్థాన్ కాబూల్‌లోని (Afghan news) ఓ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు చనిపోయినట్లు తాలిబన్ల(Afghanistan Taliban) అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తల్లి స్మారక కార్యక్రమం జరుగుతున్న క్రమంలోనే.. ఈద్గా మసీదు లక్ష్యంగా బాంబు దాడి జరిగిందని తెలిపారు. అయితే.. మసీదు బయట ఉన్న పౌరులే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ముగ్గురు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే.. ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను (Afghan news) ఆక్రమించుకున్నప్పటి నుంచి ఐసిస్(Afghanistan ISIS) ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు తీవ్రవాద ముఠాల మధ్య సంఘర్షణ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐసిస్.. తూర్పు నంగర్హర్లో తమ ఉనికిని క్రమంగా విస్తరించుకుంటోంది. జలాలాబాద్ సహా కాబూల్‌లో ఎన్నో దాడులు జరిపి చాలా మందిని పొట్టనపెట్టుకున్నారు.
ఇవీ చూడండి: ISIS Attack in India: భారత్‌పై ఐసిస్ గురి- ఎన్ఐఏ హెచ్చరిక