ETV Bharat / international

Afghanistan Taliban: కాళ్లు, చేతులు నరికే శిక్షలు మళ్లీ వస్తాయ్​.. - తాలిబన్ల పాలన నిబంధనలు

అఫ్గానిస్థాన్‌లో(Afghanistan latest news) తాలిబన్ల గత పాలన తరహాలోనే ఇప్పుడు కూడా దోషులను కఠినంగా శిక్షిస్తామని తాలిబన్​ నేత తురాబీ నూరుద్దీన్‌ స్పష్టం చేశారు. ఖురాన్‌ ప్రకారమే చట్టాలు(Taliban punishment in Afghanistan) రూపొందించుకుంటామని.. కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Afghanistan Taliban
అఫ్గానిస్థాన్​లో శిక్షలు
author img

By

Published : Sep 24, 2021, 1:19 PM IST

ఒకప్పటిలా క్రూర విధానాలను ఈ దఫా పాలనలో అనుసరించబోమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన తాలిబన్లు (Afghanistan Taliban) ఇప్పుడు మాట మార్చారు! అఫ్గానిస్థాన్‌లో (Afghanistan latest news)1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు (Taliban rules for Afghanistan) అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

Taliban official
తాలిబన్‌ నేత తురాబీ నూరుద్దీన్‌

తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ (Mullah Nooruddin Turabi) తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. "గతంలో మేం బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శలు గుప్పించాయి. కానీ మేమెప్పుడూ ఆయా దేశాల చట్టాలు, శిక్షల గురించి మాట్లాడలేదు. మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదు. మేం ఇస్లాంను అనుసరిస్తాం. ఖురాన్‌ ప్రకారమే చట్టాలు(Taliban punishment in Afghanistan) రూపొందించుకుంటాం. గత పాలన తరహాలోనే ఇప్పుడు కూడా దోషులను కఠినంగా శిక్షిస్తాం. చేతులు, కాళ్లు నరకడం వంటి శిక్షలను అమలు చేస్తాం. అయితే వాటిని బహిరంగంగా అమలు చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి" అని పేర్కొన్నారు.

తాలిబన్ల గత ప్రభుత్వంలో(Taliban ruling afghan) తురాబీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో అఫ్గాన్‌లో (Afghanistan Taliban) హంతకులను బహిరంగంగా కాల్చిచంపడం, దొంగల కాళ్లు-చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉండేవి.

ఇదీ చూడండి: Afghanistan News: తాలిబన్లతో చైనా, రష్యా, పాక్‌ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.