పాకిస్థాన్‌లో ఉగ్రవాదకార్యకలాపాలు నిర్వహిస్తున్న తెహ్రీక్-ఇ-తాలిబన్(టీటీపీ)ను(Tehrik-i-Taliban Pakistan) కట్టడి చేస్తామని తాలిబన్లు(Taliban News) తెలిపారు. ఈ మేరకు పాక్‌కు హామీ ఇచ్చారు. తమ భూభాగాన్ని పాకిస్థాన్‌పై దాడులు చేసేందుకు వాడుకోనివ్వమని అభయమిచ్చారు. కాబుల్‌ను ఆక్రమించిన తర్వాత జైళ్లలో ఉన్న టీటీపీ ఉగ్రవాదులందరినీ తాలిబన్లు(Afghanistan Taliban) విడుదల చేశారు. ఇందులో పాక్.. మోస్ట్‌వాంటెడ్‌గా ప్రకటించిన వారు కూడా ఉన్నారు. దీంతో పాక్ ఆందోళన వెలిబుచ్చింది. అయితే అలాంటి భయాలు పెట్టుకోనక్కర్లేదని, తెహ్రీకీ ఉగ్రవాదులను అదుపులో ఉంచుతామని పాక్ హోంమంత్రి షేక్ రషీద్‌కు తాలిబన్లు మాట ఇచ్చారు. అయితే దీన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారో చూడాలి. ఎందుకంటే అఫ్గాన్ సైన్యంపై తాలిబన్లు జరిపిన దాడుల్లో తెహ్రీకీ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. తాలిబన్లకు అండగా నిలిచారు.
'అమెరికా పారిపోయింది'
అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు(Afghanistan crisis) అమెరికాయే కారణమని చైనా ఆక్షేపించింది. అగ్రరాజ్యం తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి, అఫ్గాన్‌ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిందని పేర్కొంది. "చెప్పే మాటలకు పొంతన ఉండేలా అమెరికా చర్యలు ఉంటాయని ఆశిస్తున్నా. అఫ్గానిస్థాన్ అభివృద్ధికి, పునర్నిర్మాణానికి ఇచ్చిన హమీలకు ఆ దేశం కట్టుబడి ఉండాలి" అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వెన్‌బిన్ తెలిపారు.
ఇదీ చూడండి: Afghan Crisis: 'అమెరికా.. అలా చేయడం సరికాదు'
ఇదీ చూడండి: బైడెన్‌కు తాలిబన్ల హెచ్చరిక- 'రెడ్ లైన్' దాటితే అంతే!