ETV Bharat / international

తాలిబన్ల క్రూరత్వం.. క్రేన్లకు మృతదేహాలు.. గురుద్వారాపై దాడులు - అఫ్గాన్ న్యూస్​

అఫ్గాన్​లో (Afghanistan Taliban) అధికారం చేపట్టాక.. 'ఒకప్పటిలా క్రూర విధానాలను ఈ దఫా పాలనలో అనుసరించబోమని' చెప్పిన తాలిబన్లు.. ఇప్పుడు ఆ మాటలను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తున్నారు. మృతదేహాలను బహరంగంగా వేలాడదీస్తూ 1990ల నాటి పాలనను గుర్తుకుతెస్తున్నారు. మరోవైపు.. మైనారిటీలపైనా(Minorities In Afghanistan) తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబుల్​లోని ఓ గురుద్వారాను కొంతమంది తాలిబన్లు ధ్వంసం చేసి, అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు.

afghanistan taliban
అఫ్గానిస్థాన్ తాలిబన్లు
author img

By

Published : Oct 6, 2021, 2:44 PM IST

1990ల నాటి క్రూర పాలన గుర్తుకు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారు అఫ్గాన్​లోని తాలిబన్లు(Afghanistan Taliban). దోషులకు బహిరంగ శిక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా ఓ ముగ్గురు దోషుల మృతదేహాలను నడివీధిలో క్రేన్​కు వేలాడదీసి, ప్రదర్శించారు.

అసలేం చేశారు?

తన ఇంటిని బద్దలుగొట్టి చొరబడాలని ముగ్గురు దుండగులు యత్నించగా.. ఓ వ్యక్తి వారిని చంపేశాడని డిప్యూటీ గవర్నర్ మాల్వాయ్​ షిర్​ అహ్మద్ ముజాహిర్.. మీడియాకు తెలిపారు. దోషుల మృతదేహాలను తాలిబన్లు.. ఈశాన్య హెరాత్​లోని ఓబే జిల్లాలో రెండు క్రేన్లకు వేలాడదీసినట్లు చెప్పారు.

సెప్టెంబర్​లోనూ..

రెండు వారాల కిందట ఇదే తరహాలో హెరాత్ నగరంలో ప్రధాన కూడలి​ వద్ద మృతదేహాలను క్రేన్​కు కట్టి వేలాడదీశారు తాలిబన్లు. ఓ తండ్రి, కొడుకును కిడ్నాప్ చేసేందుకు నలుగురు దుండగులు యత్నించగా.. ఓ పోలీసు అధికారి వారిని కాల్చాడు. అనంతరం.. వారిలో ఒకరి మృతదేహాన్ని కూడలి వద్ద క్రేన్​కు వేలాడదీశారు. మిగతావారి మృతదేహాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేలాడదీసి, ప్రదర్శించారు.

"నేరగాళ్లకు తాము సేఫ్​ జోన్​లో లేము అని తెలియజేసేందుకే ఈ తరహా చర్య వెనుక ఉద్దేశమని" ఓ గుర్తు తెలియని తాలిబన్ గతంలో మీడియాకు తెలిపారు.

1996 నుంచి 2001 అఫ్గాన్​ను పరిపాలించిన తాలిబన్లు.. ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేశారు. దొంగల చేతులు, కాళ్లు నరికి వేలాడదీయడం, వ్యభిచారం చేసేవారిని దాడిచేసి చంపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు మళ్లీ అదే తరహా చర్యలకు పాల్పడుతూ.. అఫ్గాన్ వాసులను భయాందోళనకు గురిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

గురుద్వారాపై దాడి..

మరోవైపు.. అఫ్గాన్​లోని మైనారిటీలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. వారిపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబుల్​లోని కొంతమంది సాయుధులైన తాలిబన్లు... గురుద్వారా కార్తె పర్వాన్​లోకి ప్రవేశించి, ధ్వంసం చేశారు. అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు.

"కాబుల్​ నుంచి ఆందోళనకరమైన వార్తలు వింటున్నాం. సాయుధులైన కొంతమంది తాలిబన్ అధికారులు.. కాబుల్​లోని కార్తే పర్వాన్​లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న సిక్కు మతస్థులను అదుపులోకి తీసుకున్నారు. గురుద్వారాలోని సీసీటీవీ కెమెరాలను తొలగించి, గురుద్వారాను ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు" అని ఇండియన్ వరల్డ్ ఫోరమ్​ అధ్యక్షుడు పునీత్ సింగ్ తెలిపారు.

ఘటనాస్థలికి అఫ్గాన్​లోని స్థానిక గురుద్వారా నిర్వాహకులు చేరుకుంటున్నారు. తాలిబన్లు అదుపులోకి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారన్నది తెలియాల్సి ఉంది.

జెండా తొలగించారు..

అంతకుముందు... అఫ్గాన్​లోని తూర్పు పాక్తియా ప్రావిన్సులోని గురుద్వారాలో తాలిబన్లు పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్​)ను తొలిగించారు. పాక్తియాలో ఉన్న ఈ గురుద్వారాను సిక్కుల మతగురువు గురునానక్​ గతంలో సందర్శించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.