ఈ నెల మొదటి వారంలో.. అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు(taliban government news).. తాజాగా కేబినెట్‌ను(taliban cabinet news) విస్తరించారు. డిప్యూటీ మంత్రుల జాబితాను విడుదల చేశారు. ప్రపంచ దేశాల ఆభ్యర్థనలు, డిమాండ్లను లెక్కచేయని తాలిబన్లు.. ఆపద్ధర్మ కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటునివ్వలేదు.
గత పాలనలో బాలికలు, మహిళలకు(afghan women taliban) ఎటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు తాలిబన్లు(taliban latest news). వారిని విద్య, ఉద్యోగాలకు దూరం చేశారు. తిరిగి 2021 ఆగస్టులో మెరుపువేగంతో అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం మహిళలపై తాలిబన్లు మునుపటిలాగే ప్రవర్తిస్తారన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో మహిళలకు స్థానం కేటాయించాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేసింది. వాటిని తాలిబన్లు పట్టించుకోలేదు.
ఇదీ చూడండి:- Mullah Baradar: ప్రభుత్వ కూర్పు నచ్చకే బరాదర్ అజ్ఞాతవాసం!
తమ తాజా చర్యలను తాలిబన్లు సమర్థించుకున్నారు. ప్రస్తుతం కేబినెట్లో హజారా వంటి మైనారిటీలకు స్థానం కల్పించామని, మహిళలకు తర్వాత చోటు ఇచ్చే అవకాశముందన్నారు తాలిబన్ల ప్రతినిధి జహిబుల్లా ముజాహిద్. ఇక ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించకుండా ఉండేందుకు కారణాలు లేవని, ఆ పనిని తక్షణమే చేయాలని తేల్చిచెప్పారు.
మొదటి నుంచి 'ఆపద్ధర్మ ప్రభుత్వం' పేరుతోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు తాలిబన్లు. మార్పులు జరుగుతాయని సూచిస్తున్నారు, కానీ ఎన్నికలు ఉంటాయా? లేదా? అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు.
బాలికలు స్కూళ్లకు వెళ్లొచ్చా?
6-12 క్లాసుల అబ్బాయిలు తక్షణమే స్కూళ్లల్లో చేరాలని గత వారం ఆదేశాలిచ్చింది విద్యాశాఖ(taliban education system). బాలికలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇదే విషయాన్ని ముజాహిద్ వద్ద ప్రశ్నించగా.. 'అది తాత్కాలిక నిర్ణయమే. బాలికలు స్కూళ్లకు ఎప్పుడు వెళ్లాలన్నది త్వరలోనే ప్రకటిస్తాం,' అని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:-