అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు(Afghanistan Taliban).. వరుస దురాఘతాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత పాశవిక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
తఖార్ ప్రాంతంలో.. ఓ చిన్న పిల్లాడికి మరణశిక్ష విధించారు తాలిబన్లు (Taliban Executes Child). అతడి తండ్రిని.. అఫ్గాన్ రెసిస్టెన్స్ ఫోర్స్(తిరుగుబాటు దళం) సభ్యుడిగా అనుమానించే ఈ చర్యకు పూనుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పంజ్‌షేర్‌లోని ఓ ప్రతినిధి ట్వీట్ చేశారు.
''తండ్రి రెసిస్టెన్స్ బృందంలో ఉన్నాడనే అనుమానంతో.. తఖార్ ప్రావిన్స్‌లో చిన్నపిల్లాడిని తాలిబన్ ఫైటర్లు చంపేశారు. #WarCrimes #Afghanistan''
- పంజ్‌షేర్ ప్రతినిధి
అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత.. తాలిబన్లు (Afghanistan Taliban) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ప్రపంచ దేశాలు తమను అధికారికంగా గుర్తిస్తాయని తాలిబన్లు (Taliban news) ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మహిళలపై ఆంక్షలు, నో షేవింగ్..
తొలుత శాంతియుతంగానే కాబుల్‌ను ఆక్రమించుకున్నట్లు కనిపించిన తాలిబన్లు.. మెల్లమెల్లగా ఒకప్పటి పాలనను గుర్తుకుతెస్తున్నారు.
- కొద్దిరోజుల కింద హెరాత్ నగరంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన వారికి కఠిన శిక్షను అమలు చేశారు తాలిబన్లు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురిని కాల్చిచంపారు(Afghanistan crime news). అనంతరం వారిలో ఒకరి మృతదేహాన్ని నగరంలోని ప్రధాన కూడలి వద్ద క్రేన్‌కు వేలాడదీశారు.
- హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైల్‌గా హెయిర్ కటింగ్, గడ్డం చేయకుండా(trimming beard and mustache).. బార్బర్లపై నిషేధం విధించారు.
- కాబుల్‌లో పనిచేసే మహిళలు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఆదేశాలిచ్చింది తాలిబన్ ప్రభుత్వం. డిజైనింగ్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ తదితర పనుల్లో నైపుణ్యం కలిగిన వారికి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పింది. ఈ పూర్తి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అఫ్గాన్‌లో మహిళల విద్యపైనా ఆంక్షలు విధించి.. వారి స్వేచ్ఛను హరించివేశారు తాలిబన్లు.
- పౌరులపై అనేక ఆంక్షలు అమలు చేసిన తాలిబన్లు.. మీడియాపైనా కఠిన నిబంధనలను విధించారు. దీంతో అఫ్గాన్‌లోని జర్నలిస్టులు భయపడిపోతున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాసంస్థ తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు ఉంటాయని తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా తురాబీ ప్రకటించడం గమనార్హం. ఆయన ప్రకటించిన కొద్దిరోజులకే.. ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇవీ చూడండి: Afghanistan Taliban: కాళ్లు, చేతులు నరికే శిక్షలు మళ్లీ వస్తాయ్..
Taliban news: తాలిబన్ల పాలనలో తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలా..
taliban girls education: అబ్బాయిలకే చదువులు.. అమ్మాయిలు ఇళ్లకే!