కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద పేలుళ్లను తాలిబన్లు ఖండించారు. ఈ పేలుళ్లుకు అమెరికా బలగానే బాధ్యత వహించాలన్నారు. అగ్రరాజ్యం బలగాలున్న ప్రాంతంలోనే ఈ పేలుళ్లు జరిగాయని స్పష్టం చేశారు. " మా గ్రూప్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. అని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ అన్నారు.
పేలుళ్లను ఖండించిన ఐరాస..
మరోవైపు.. కాబుల్ విమానాశ్రయం వద్ద పేలుళ్ల దాడిని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఖండించింది. ఈ ఘటన అఫ్గాన్‌లోని దారుణ పరిస్థితిని తెలియజేస్తోందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. ప్రపంచ సంస్థగా.. అఫ్గాన్‌కు తక్షణసాయం చేసేందుకు బలోపేతం అవుతామన్నారు.
అఫ్గానిస్థాన్‌లోని కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల వరుస దాడులు జరిగాయి. దేశం విడిచి వెళ్లిపోయేందుకు వేలాది మంది ఎయిర్పోర్ట్ బయట వేచిచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనల్లో 72 మంది మరణించారని తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని చెప్పారు. కాగా, గాయాలతో సుమారు 143 మంది ఆసుపత్రిలో చేరినట్లు కాబుల్ లోని ఎమర్జెన్సీ ఆస్పత్రి వెల్లడించింది.
ఇవీ చదవండి: కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడులు- 13 మంది మృతి