ETV Bharat / international

'దోహా' ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లో శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్నామని అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్​కు స్పష్టం చేశారు తాలిబన్లు. దశాబ్దాల సంఘర్షణకు తెర దించేందుకు ఇదో బృహత్తర ఒప్పందం అని కొనియాడారు.

author img

By

Published : Nov 10, 2020, 6:33 PM IST

Updated : Nov 10, 2020, 7:56 PM IST

Taliban assures new US admin of implementing Doha deal
'దోహా' ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లో శాంతిస్థాపనపై అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే బైడెన్​కు తాలిబన్లు​స్పష్టమైన సంకేతాలు పంపారు. దశాబ్దాల కాలంగా అఫ్గానిస్థాన్​లో నెలకొన్న అశాంతిని రూపుమాపేందుకు అమెరికాతో చేసుకున్న దోహా ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇరువురి మధ్య వివాదానికి తెరదించేందుకు 'అమెరికా-తాలిబాన్ ఒప్పందం' అమలు కచ్చితంగా జరగాలని తాలిబన్లు పేర్కొన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా ఒప్పందం అమలుకు సహకరించాలని కోరారు.

దోహా ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం. దీంతో అఫ్గాన్​ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మా అంతర్గత వ్యవహారాలను చర్చల ద్వారా చక్కబెట్టుకుంటాం. కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు బైడెన్​ ఈ ఒప్పందాన్ని గౌరవిస్తారు అని అనుకుంటున్నాం. మేము వ్యక్తితో కాదు అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం.

-తాలిబన్​ ప్రతినిధి

ఇదీ చూడండి: 'తాలిబన్లు కట్టుబడి ఉంటేనే సేనల ఉపసంహరణ'

Last Updated : Nov 10, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.