తైవాన్‌లోని కోష్యింగ్ నగర ప్రజలు ప్రత్యేక ఎన్నికల ద్వారా తమ సిటీ మేయర్‌ను రీకాల్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. మేయర్ హాన్ కుయోపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం 1,823 పోలింగ్ కేంద్రాల్లో... మేయర్ రీకాల్ పోలింగ్ జరుగుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలు వెల్లడవుతాయి.
మేయర్ హాన్ కుయో తన పదవిని కాపాడుకోవాలంటే మొత్తం 25 మిలియన్ల మంది అర్హత కలిగిన ఓటర్లలో కనీసం 25 శాతం మంది మద్దతు పొందితీరాలి.
రీకాల్ డిమాండ్
తైవాన్ను తమ భూభాగంగా గుర్తించాలన్న చైనా డిమాండ్‌ను పాలక డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తిరస్కరించింది. ఈ పార్టీ తరపున 2017 ఎన్నికల్లో పోటీ చేసిన హాన్ కుయో అనూహ్య విజయం సాధించారు.
అయితే పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించుకున్నారు. దీనితో ఆయనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. డీపీపీ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ చేతిలో 57% - 38% ఓట్ల తేడాతో హాన్ కుయో ఓటమి పాలయ్యారు.
హాంకాంగ్‌లో చైనా అణచివేత చర్యలను హాన్ కుయో సమర్థించడం, అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీనితో ఆయనను రీకాల్ చేయాలని డిమాండ్లు పెరిగిపోయాయి.
చైనా కబంద హస్తాల్లో
తైవాన్.. చైనా కబంద హస్తాల్లో ఇరుక్కొని ఉంది. అయితే చైనా, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసికొడుతున్న వేళ ఈ చిన్న ద్వీపదేశానికి అగ్రరాజ్యం అమెరికా చేదోడుగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: 'అప్పుడే అయిపోలేదు.. ఉగ్రరూపం ఇప్పుడే మొదలైంది'