Taiwan Rat Covid: కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్న తైవాన్‌లో.. దాదాపు 30 రోజుల అనంతరం ఓ పాజిటివ్ కేసు వెలుగుచూసింది. కానీ.. ఈ కేసు వ్యాప్తి వెనుక ఓ చిన్న ఎలుక ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇదీ జరిగింది..
Taiwan Covid Cases: తైపీలోని హై సెక్యూరిటీ ప్రయోగశాల 'అకాడెమికా సినికా జెనోమిక్ రీసెర్చ్ సెంటర్'లో ఉద్యోగిగా పనిచేస్తున్న 20 ఏళ్ల ఓ ల్యాబ్ వర్కర్‌ను కొవిడ్ సోకిన ఓ ల్యాబోరేటరీ చిట్టెలుక కరిచింది. అనంతరం ఆమె కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి చెన్ షిహ్ చుంగ్ ధ్రువీకరించారు కూడా. దేశంలోనే అత్యున్నత పరిశోధనా సంస్థల్లో ఒకటైన ఈ ప్రయోగశాలలో.. వ్యాధికారకాలపై పరిశోధనలు, జంతువుల్లో వ్యాక్సిన్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుంటారు.
చిట్టెలుకే కారణమా..?
అయితే.. ల్యాబ్ వర్కర్‌కి చిట్టెలుక కరవడం వల్లే కరోనా వ్యాపించిందా? అనే అంశాన్ని నిర్ధరించేందుకు అంతర్గత విచారణ చేపట్టాలని సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్ ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు డెల్టా వేరియంట్ సోకినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఆమెతో సన్నిహితంగా మెలిగిన 94 మందిని క్వారంటైన్‌కి తరలించారు. తైవాన్‌లో నవంబర్ 5న చివరి కేసు నమోదైంది.
మరోవైపు.. జంతువుల నుంచి మనుషులకు కొవిడ్ వ్యాపించే ప్రమాదం తక్కువేనని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ నివేదికలో స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: