అఫ్గానిస్థాన్‌లోని లాగ్మాన్ గవర్నర్ రహ్మతుల్లా యర్మాల్ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది మరణించారు. వీరిలో నలుగురు పౌరులు. మరో 38 మంది క్షతగాత్రులయ్యారు. గవర్నర్ సురక్షితంగా బయటపడ్డారు.
పేలుళ్లు వెనక ఎవరి హస్తం ఉందనే దానిపై స్పష్టత లేదు. ఇస్లామిక్ స్టేట్, తాలిబన్లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లాగ్మాన్కు సమీపంలో ఉన్న నంగర్‌హార్ రాష్ట్రంలో శనివారం ఇదే తరహాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మృతి చెందారు. వీరంతా మధ్యాహ్నం ప్రార్థన సమయంలో గుమ్మిగూడి ఉండగా పేలుడు జరిగింది.
ఇదీ చదవండి: పాక్ 'బ్లాక్‌లిస్ట్' భవితవ్యం తేలేది ఈ నెలలోనే