ETV Bharat / international

శునకంతో నర్సు స్నేహం.. 'కరోనా' ఒత్తిడి మాయం - చైనా వుహాన్​ ఆసుపత్రులు

కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించిన సమయంలో చైనా వుహాన్​లో ఆసుపత్రులు అల్లకల్లోలంగా ఉండేవి. రోగులకు చికిత్స అందించడానికి ఇతర ప్రాంతాల నుంచి ఆరోగ్య కార్యకర్తలను పిలిచేవారు. వారిలో జాంగ్​ డేన్​ ఒకరు. ఆమె అక్కడి వారందరిలోనూ స్ఫూర్తి నింపింది. ఈ నేపథ్యంలో ఆమెకు.. శునకం రూపంలో ఓ మంచి నేస్తం లభించింది. ఆ కుక్కతో కొద్ది సేపు గడిపితే చాలు.. ఒత్తిడి నుంచి జాంగ్​ విముక్తి పొందేది. ఆ కథ మీరూ చదివేయండి.

Street dog helps see Chinese nurse through virus traumas
శునకంతో నర్సు స్నేహం.. 'కరోనా' ఒత్తిడి మాయం
author img

By

Published : May 30, 2020, 6:36 PM IST

ప్రపంచంలో ఎన్ని జంతువులు ఉన్నా.. మనిషికి శునకాలతో ఓ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. రోజంతా ఉద్యోగంలో ఎంతో అలసిపోయి ఇంటికి చేరే మనిషి.. తన ప్రియ నేస్తమైన శునకంతో కొద్దిసేపు ఆడుకుంటే చాలు ఆ అలసటంతా మాయమైపోతుంది. ఇందుకు ఉదాహరణగా.. వైరస్​కు కేంద్రబిందువైన చైనాలోని వుహాన్​లో ఓ సంఘటన జరిగింది. వైరస్​ రోగులకు చికిత్స అందిస్తూ తీవ్ర ఒత్తిడికి లోనైన నర్సుకు.. ఓ శునకం ఒత్తిడి దూరం చేసింది.

ఛాంగ్​చన్​ టు వుహాన్​...

జనవరి- మార్చి చివరి వరకు చైనావ్యాప్తంగా కరోనా తన ఉగ్రరూపాన్ని చూపించింది. ముఖ్యంగా వుహాన్​లో పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవి. రోజూ వేలాది మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరుతుండటం వల్ల ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో చైనావ్యాప్తంగా ఉన్న 42,600 మంది ఆరోగ్య కార్యకర్తలను వుహాన్​కు తరలించారు. వారిలో జాంగ్​ డేన్​ అనే నర్సు ఒకరు.

వుహాన్​కు వెళ్లాలన్న జాంగ్​ డేన్​​ నిర్ణయంపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తాను వెనుకడుగు వేయలేదు. దేనికైనా సిద్ధమని తేల్చిచెప్పింది. తన పేరు మీద జీవిత బీమా కూడా తీసుకుంది. ఈ పోరాటంలో తనకు ఏదైనా అయితే.. కనీసం తన తల్లిదండ్రులు సుఖంగా ఉంటారని అనుకుంది.

జాంగ్​ డేన్​ తన భర్తతో కలిసి ఛాంగ్​చన్​ నగరంలోని ఓ అపార్టమెంట్​లో నివసిస్తోంది. ఆమెకు మొక్కలన్నా, కుక్కలన్నా ఎంతో ఇష్టం. తన వద్ద అప్పటికే నాలుగు శునకాలున్నాయి.

ఫిబ్రవరిలో వుహాన్​కు చేరుకున్న జాంగ్​​ డేన్​కు.. తను నిర్వర్తించాల్సిన బాధ్యత అర్థమైంది. ఆ సమయానికే వుహాన్​ ఆసుపత్రుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. జాంగ్​ డేన్ వెంటనే​ రంగంలోకి దిగింది.

సాధారణంగా పీపీఈ కిట్​ను పూర్తిగా ధరించడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. వైద్య సిబ్బందికి శౌచాలయానికి కూడా వెళ్లే సమయం ఉండేది కాదు. అందువల్ల వారు డైపర్లు వేసుకుని పని చేసే వారు.

వృద్ధులకు చికిత్స అందించేది జాంగ్​ డేన్​. వీరిలో చాలా మందికి 'నా' అనే వారు కూడా ఉండేవారు కాదు. కష్ట సమయాల్లో.. జాంగ్​ వారి వెన్నంటే నిలిచేది. వారి కోసం పాటలు పాడేది. వారికి స్నానాలు కూడా చేయించేంది. చుట్టూ ఉన్న వారిని ఉత్సాహపరిచేది.

ఇంత తీరికలేని సమయంతో ఒకానొక సందర్భంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది జాంగ్​ డేన్​. అప్పడే తన జీవితంలోకి ఓ శునకం వచ్చింది. ఆసుపత్రి ఆవరణలో తిరుగుతుండగా.. ఓ చిన్న, పసుపు రంగు కుక్కను చూసింది జాంగ్​. అప్పటి నుంచి వారిద్దరు మంచి స్నేహితులైపోయారు. ఆ శునకానికి 'డౌడౌ' అని పేరు పెట్టింది.

డౌడౌతో కొంత సేపు సమయం గడిపితే చాలు.. జాంగ్​ డేన్​ ఒత్తిడి అంతా పోయేది. డౌడౌను కూడా అన్ని తానై చూసుకునేది.

కానీ మార్చి మధ్య వారంలో వుహాన్​లో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి. ఆసుపత్రుల్లో రోగుల తాకిడి తగ్గింది. జాంగ్​ తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. డౌడౌకు ఆవాసాన్ని కల్పించడానికి నర్సు కృషి చేసింది. శునకానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. స్థానిక జంతు సంరక్షకులు.. డౌడౌకు నివాసం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.

ఏప్రిల్​ 8న జాంగ్​ డేన్​ తన ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. కానీ డౌడౌను చాలా మిస్​ అయ్యేది. డౌడౌను ఎలాగైనా తన ఇంటికి తెచ్చుకోవాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టుగానే ఈ నెల తొలివారంలో డౌడౌ.. ఛాంగ్​చున్​లోని జాంగ్​ ఇంటికి​ చేరుకుంది. ప్రస్తుతం డౌడౌ ఇతర శునకాలతో ఖుషీఖుషీగా ఆడుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.