ETV Bharat / international

చైనా ఆయుధాలు కొనేందుకు దేశాల వెనకడుగు! - చైనా యుద్ధ విమానాలు

అంతర్జాతీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో పైచేయి సాధించాలనే చైనా(china) ఆకాంక్ష ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని దేశాలతో శత్రుత్వం పెంచుకుంటూ డ్రాగన్‌ అవలంబిస్తున్న విదేశాంగ విధానమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. భారత్ కంటే దాదాపు మూడు రెట్లు అధిక నిధులు కేటాయించి.. ఆధునాతన యుద్ధ విమానాలు, ఆయుధాలను చైనా తయారు చేస్తున్నా.. వాటిని కొనేందుకు మాత్రం ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు.

china weapons
చైనా ఆయుధాలు
author img

By

Published : Jul 5, 2021, 6:41 AM IST

Updated : Jul 5, 2021, 7:14 AM IST

ప్రపంచవ్యాప్తంగా అనేక వివాదాలకు చైనా(china) కేంద్రబిందువుగా ఉంది. సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలతో తగువులు పెట్టుకోవడంలో డ్రాగన్‌కు ఎవరూ సాటిరారు. విస్తరణవాదంతో ముందుకెళుతున్న చైనా.. పలు దేశాలతో శత్రుత్వం పెంచుకుంటోంది. ఈ ప్రభావం ఆ దేశ రక్షణ ఎగుమతులపై పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చైనా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. కరోనా మహమ్మారికి చైనానే ఆజ్యం పోసిందని అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తూ వచ్చాయి. దీనికి తోడు డ్రాగన్‌ నావికాదళాలు ఫిలిప్పీన్స్‌ సహా ఇతర దేశాల సముద్ర జలాల్లో అనధికారికంగా ప్రవేశించడం అంతర్జాతీయంగా వివాదాలకు దారితీస్తోంది.

అంతకంతకూ క్షీణిస్తుండగా..

మరోవైపు లద్దాఖ్‌ సరిహద్దు వివాదంలో భారత్‌తో చైనా కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. ఈ విధానం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను క్షీణింపజేసిందని అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడించింది. ఓ వైపు చైనా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు అంతకంతకూ క్షీణిస్తుండగా.. మరోవైపు ఆయుధాల కోసం విదేశాలపైనే ఎక్కువ ఆధారపడుతున్న భారత్‌ ఇప్పుడు ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం ద్వారా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది. 2011-20 మధ్యకాలంలో భారత ఆయుధ దిగుమతులు 33 శాతం తగ్గితే.. చైనా ఆయుధ ఎగుమతులు 7.8 శాతం తగ్గిపోవడం గమనార్హం.

కేవలం 7.2 బిలియన్‌ డాలర్లవే..

భారత్‌తో పోలిస్తే చైనా రక్షణ విభాగానికి దాదాపు మూడు రెట్లు అధిక నిధులను కేటాయిస్తోంది. వీటితో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన జె-10, జె-10సి, ఎఫ్‌సి-31 లాంటి యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. అయినప్పటికీ గడిచిన రెండు దశాబ్దాల కాలంలో కేవలం 7.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను మాత్రమే చైనా ఎగుమతి చేసినట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా ఆయుధాల ఎగుమతుల్లో అమెరికా దాదాపు 100 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో మొదటి స్థానంలో ఉంది. 61.5 బిలియన్‌ డాలర్లతో రష్యా రెండో స్థానంలో, 14.7 బిలియన్‌ డాలర్లతో ఫ్రాన్స్‌ మూడో స్థానంలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. వీటితో పోలిస్తే డ్రాగన్‌ ఆయుధ ఎగుమతులు అత్యంత తక్కువగా ఉన్నాయని తెలిపింది.

ప్రస్తుతం పాకిస్థాన్‌ మాత్రమే చైనా రక్షణ ఉత్పత్తులపై ఆధారపడిందని నివేదిక వెల్లడించింది. గడిచిన ఐదేళ్లుగా పాక్‌ మిలటరీకి అవసరమైన ఆయుధాల్లో దాదాపు 74 శాతం బీజింగ్‌ నుంచే దిగుమతి చేసుకుంటోందని పేర్కొంది. చైనా కయ్యానికి కాలుదువ్వే వైఖరి కారణంగా ఆ దేశ రక్షణ రంగ ఉత్పత్తులను కొనేందుకు ఏ దేశం కూడా ముందుకురావడం లేదు.

ఇదీ చూడండి: అమెరికాను ఢీ కొట్టేందుకు చైనా భారీగా క్షిపణుల నిల్వ!

ఇదీ చూడండి: 'భారత సైన్యం సత్తా ఏంటో చైనాకు అర్థమైంది'

Last Updated : Jul 5, 2021, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.