రానున్న రోజుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ని ఆదేశించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. మరో రెండు రోజుల్లో చైనాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పోరాట సన్నద్ధను మరింత మెరుగుపరుచుకోవాలని వ్యాఖ్యానించారు.
చైనా గిజోవ్ రాష్ట్రంలోని ఎయిర్ ఫోర్స్ విభాగాన్ని జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా చైనా బలగాలకు పలు సూచనలు చేశారు. సెలవు రోజుల్లో దేశ భద్రతతో పాటు, ప్రజల శాంతి, సంతోషాలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని చైనా మిలిటరీ నిపుణుడు ఫూ క్విన్షావో తెలిపారు.
"చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.. చాలా యుద్ధాలు సెలవురోజుల్లోనే జరిగాయి. ఆ సమయంలో అందరూ అలసత్వంతో ఉంటారు. అందువల్ల మేము దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం."
--ఫూ క్విన్షావో, మిలిటరీ నిపుణుడు.
దక్షిణ చైనా సముద్రం, లద్దాఖ్‌లో ఉద్రిక్తత, తైవాన్ వివాదం తదితర కారణాల వల్ల సెలవు రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా బలగాలను మోహరించింది జిన్‌పింగ్ ప్రభుత్వం.
ఇదీ చదవండి : విద్యుత్ కాంతుల్లో చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ అదరహో!