కరోనా విజృంభణ నేపథ్యంలో శ్రీలంక అధికారులు ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను మూసేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఇంకొన్ని రోజులు కర్ఫ్యూ ఇలాగే కొనసాగుతుందని తెలిపారు.
విదేశాల్లోని లంకేయులకు మాత్రమే
జనం గుంపులుగా సమావేశమవడం తగ్గించడానికి అన్ని సేవలు నిలిపివేస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశాల్లో మరణించిన శ్రీలంక వారికి సంబంధించిన విషయాల్లోనే అధికార యంత్రాంగం పనిచేస్తుందని తెలిపింది.
రెవెన్యూ, వలసవాదం, పెన్షన్లు, వాహన లైసెన్స్ సంబంధిత సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలు కూడా తమ కార్యకలాపాలను ఈ వారం నిలిపివేశాయి.
కరోనా ఉద్ధృతి తీవ్రం
ఈ వారం 1,034 పాజిటివ్ కేసులు నమోదవ్వగా దాదాపు 2000 మంది క్వారంటైన్లో ఉన్నారు.
దేశంలో ఇప్పటివరకు 4,252 కేసులు నమోదవ్వగా 13 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. 3,274 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇదీ చూడండి: కరోనా సోకడం నా మంచికే: ట్రంప్