ETV Bharat / international

శ్రీలంక రక్షణ కార్యదర్శి ఫెర్నాండో రాజీనామా - resigns

అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సూచన మేరకు శ్రీలంక రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో రాజీనామా చేశారు. వరుస బాంబు పేలుళ్లను నివారించడంలో విఫలమైనందున బాధ్యతల నుంచి తప్పుకోవాలని సిరిసేన ఇదివరకే సూచించారు.

శ్రీలంక రక్షణ కార్యదర్శి 'ఫెర్నాండో' రాజీనామా
author img

By

Published : Apr 25, 2019, 7:54 PM IST

శ్రీలంక రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో నేడు రాజీనామా చేశారు. ఈస్టర్​ పర్వదినాన కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లను నివారించడంలో ఫెర్నాండో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రక్షణ కార్యదర్శి ఫెర్నాండో తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఇటీవల సూచించారు. ఫెర్నాండోకు అన్ని పక్షాల నుంచి వ్యతిరేకత ఎదురైనందున రాజీనామా చేయక తప్పలేదు.

శ్రీలంకలో వరుస పేలుళ్ల తర్వాత ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మంగళవారం మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 24 గంటల్లో రక్షణ విభాగంలోని ఉన్నత పదవుల్లో మార్పులుంటాయని ప్రకటించారు. నిఘా​ వర్గాల సమాచారం ఉన్నప్పటికీ బాంబు పేలుళ్లను నివారించడంలో విఫలమైనందున ఐజీ జయసుందరతో పాటు రక్షణ కార్యదర్శి ఫెర్నాండో బాధ్యతల నుంచి వైదొలగాలని సిరిసేన సూచించారు.

Jalaun (Uttar Pradesh), Apr 25 (ANI): Congress general secretary for UP (East) Priyanka Gandhi held a roadshow in Jalaun, Uttar Pradesh. Massive crowd turned up to express their support to the leader. Lok Sabha polls are being held in 7 phases from April 11 to May 19. Results of the election will be announced on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.