ETV Bharat / international

కరోనా కాటుకు మరో 86 మంది బలి - New coronavirus infected 40 staff in single Wuhan hospital: study

ప్రాణాంతక కరోనా వైరస్​ ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో నిన్న ఒక్కరోజే 86 మరణించారు. దీంతో వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 722కు చేరింది. అదే సమయంలో కరోనా ప్రభావం ఎదుర్కొంటున్న దేశాలకు 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. అన్ని దేశాలు కలిసి ముప్పును ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది.

coronavirus
కరోనా వైరస్​
author img

By

Published : Feb 8, 2020, 5:27 AM IST

Updated : Feb 29, 2020, 2:33 PM IST

కరోనా కాటుకు మరో 86 మంది బలి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ ధాటికి చైనాలో మరో 86 మంది మృతి చెందారు. మొత్తంగా 722 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నూతనంగా 3400 కరోనా కేసులు నమోదైనట్లు చైనా ప్రకటించింది. అదేసమయంలో మొత్తం వైరస్​ సోకిన వారి సంఖ్య 34,500కు చేరింది. తాజా మరణాలతో రెండు దశాబ్దాల క్రితం సార్స్​ కారణంగా మరణించిన వారి సంఖ్యను కరోనా అధిగమించింది.

ఇండియాలో మరో ఇద్దరిపై పరిశీలన

కర్ణాటక ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్​(కిమ్స్)లో ఇద్దరు కరోనా అనుమానిత రోగులు చేరారని కిమ్స్ డైరెక్టర్ రామలింగప్ప తెలిపారు. వారిద్దరినీ పరిశీలన​లో ఉంచిన తర్వాత డిశ్చార్జీ చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు రోగులు కూడా చైనా నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో ఓ వ్యక్తికి కరోనా లేదని స్పష్టమైనట్లు పేర్కొన్నారు.

'పొరుగు'కు భారత్​ సాయం

చైనాలోని వుహాన్​ నగరంలో ఉన్న భారతీయులనే కాకుండా ఇతర దేశాల పౌరులను కూడా తిరిగి తీసుకువచ్చే యోచన చేసినట్లు కేంద్రం తెలిపింది. పాకిస్థాన్​ సహా వుహాన్​ నుంచి వెనక్కి రావాలనుకునే అన్ని పొరుగుదేశాల ప్రజలనూ తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు విదేశాంగ మంత్రి ఎస్​ జయ్​శంకర్..​ రాజ్యసభ వేదికగా ప్రకటన చేశారు.

"మన పొరుగుదేశాల ప్రజలందరికీ ఈ ప్రతిపాదన చేశాం. అందులో మాల్దీవులకు చెందిన ఏడుగురు మాత్రమే రావడానికి సిద్ధమయ్యారు. దాదాపు 70 మంది భారతీయులు వుహాన్​లోనే ఉండాలని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు."-ఎస్​ జయ్​శంకర్, విదేశాంగ మంత్రి

అమెరికా సాయం

చైనా సహా కరోనా ప్రభావంతో అల్లాడుతున్న దేశాలకు అగ్రరాజ్యం అమెరికా 100 మిలియన్​ అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేస్తేనే ఈ ముప్పు ప్రభావాన్ని ఎదుర్కోగలమని పేర్కొంది. ప్రత్యక్షంగా లేదా బహుళార్థక సంస్థల ద్వారా సహాయం అందిచనున్నట్లు తెలిపింది. దాదాపు 17.8 టన్నుల వైద్య ఉత్పత్తులను చైనాకు అందించినట్లు విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.

రోగుల ద్వారా సిబ్బందికి

వుహాన్​ ఆసుపత్రిలోని 40 మంది సిబ్బందికి రోగుల ద్వారా కరోనా సోకినట్లు సమాచారం. ఆసుపత్రిలో చేరిన ఒక్క వ్యక్తి నుంచే దాదాపు 10 మందికి ఈ మహమ్మారి వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వుహాన్ విశ్వవిద్యాలయం పరిధిలోని జాంగ్​నన్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించిన పత్రాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్​లో ప్రచురితమయ్యాయి. వివిధ కారణాల వల్ల ఆసుపత్రిలో చేరిన 17 మంది ఇతర రోగులకు కూడా కరోనా సోకినట్లు అధ్యయనం పేర్కొంది. ఒక్కో రోగి కారణంగా సగటున ఇద్దరికి ఈ ప్రాణాంతక వైరస్ సోకుతున్నట్లు వెల్లడించింది. ఈ కారణంగా వైరస్ సోకిన వ్యక్తులకు వైద్యం చేయడం అత్యంత కష్టంగా మారుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హెచ్చరిస్తే.. అడ్డుకున్నారు

కరోనా వైరస్​పై ముందుగానే హెచ్చరికలు చేసిన చైనా వైద్యుడు మరణించిన కొద్ది గంటల్లోనే ఈ అధ్యయనం వెలువడటం గమనార్హం. డిసెంబర్​ 30నే కరోనా వైరస్ గురించి తన సహచరులకు సమాచారం అందించారు ఆసుపత్రికి చెందిన వైద్యుడు లీ వెన్లియాంగ్. అయితే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే కారణంతో ఆయనకు పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం తీరుపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం కరోనా సోకిన ఓ రోగికి వైద్యం చేస్తుండగా ఆయనకూ ఈ ప్రాణాంతక వైరస్ వ్యాపించింది.

Last Updated : Feb 29, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.