ETV Bharat / international

కరోనాను గుర్తించిన చైనా డాక్టర్​ మృతి - Coronavirus Outbreak

కరోనా మహమ్మారిని మొదటిగా గుర్తించిన చైనా వైద్యుడు లీ వెన్​లియాంగ్​ మృతిచెందారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సైతం లీ మృతి పట్ల సంతాపం ప్రకటించింది.

Doctor who alerted world about coronavirus dies
కరోనాని గుర్తించిన చైనా డాక్టర్​ లీ వెన్​లియాంగ్​ మృతి
author img

By

Published : Feb 7, 2020, 1:52 PM IST

Updated : Feb 29, 2020, 12:48 PM IST

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని తొలుత గుర్తించిన చైనా వైద్యుడు గురువారం మృతిచెందారు. ఫిబ్రవరి 1న ఇంటెన్సివ్‌ కేర్ యూనిట్‌ (ఐసీయూ) లో చేరిన లీ వెన్‌లియాంగ్‌ గురువారం ఉదయం మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతిపట్ల చైనా ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం లీ మృతి పట్ల సంతాపం ప్రకటించింది.

సార్స్​ తరహా వైరస్​

నేత్రవైద్యుడైన లీ వెన్‌లియాంగ్‌ తనకు వద్దకు వచ్చిన ఓ రోగిలో డిసెంబరు 30న తొలిసారి కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. సార్స్‌ తరహా వైరస్‌ ఆనవాళ్లు గుర్తించానంటూ తన మిత్రులకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఆ సందేశం కాస్తా వైరల్‌ కావడంతో వైరస్‌ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తొలుత అసత్య ప్రచారాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న నేరం కింద లీని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం తన మిత్రులకు మాత్రమే చెప్పాలనుకున్నానని.. ప్రజల్ని భయపెట్టడం తన ఉద్దేశం కాదని చెప్పినా వారు వినిపించుకోలేదు. అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత వదిలిపెట్టారు. తిరిగి ఆయన విధుల్లో చేరి వైరస్‌ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు కృషి చేశారు. జనవరి రెండో వారంలో ఆయనకి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 1న ఐసీయూలో చేరి వైరస్‌తో పోరాడుతూనే ప్రాణాలు కోల్పోయారు. లీ అరెస్టుని సుప్రీం పీపుల్స్‌ కోర్టు సైతం తప్పుబట్టింది. అతను చెప్పిన విషయాన్ని వెంటనే విశ్వసించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని వ్యాఖ్యానించింది.

హీరోకు సంతాపం

లీ మృతిపట్ల చైనావ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తం అవుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. వైరస్‌ నుంచి ప్రజల్ని కాపాడడం కోసం పనిచేసిన హీరోగా కీర్తిస్తున్నారు. అదే సమయంలో లీపై పోలీసులు వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు. వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో లీ మరణించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: అమెరికా హిట్​లిస్ట్​: నాడు సులేమానీ​.. నేడు రైమి!

ZCZC
PRI ECO GEN INT
.ZURICH FGN13
SWISS-BANK-ESPIONAGE-MANAGEMENT
Embattled Credit Suisse chief Thiam steps down
         Zurich, Feb 7 (AFP) Credit Suisse, which has been rocked by a spying scandal, announced on Friday that chief executive Tidjane Thiam had resigned and would be replaced by the current head of the bank's Swiss operations.
         "The Board of Directors of Credit Suisse Group has unanimously accepted the resignation of Tidjane Thiam and appointed Thomas Gottstein as the new CEO of Credit Suisse Group," the bank said in a statement. (AFP)
SCY
02071226
NNNN
Last Updated : Feb 29, 2020, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.