శ్రీలంకలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. కొలంబోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 65ఏళ్ల వృద్ధుడు శనివారం మరణించాడు. వైరస్ సోకి మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. మృతుడు అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించాయి.
ఆ వృద్ధుడు ఇటీవల ఇటలీ పర్యటకుల బృందంతో కలిసి తిరిగడం వల్లే వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు శ్రీలంకలో 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 199 మంది అనుమానితులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది శ్రీలంక ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చేవారిపైనా ఆంక్షలు విధించింది.
ఇదీ చూడండి : కరోనా లాక్డౌన్: వేర్వేరు దేశాల్లో ఇదీ పరిస్థితి