ETV Bharat / international

'వ్యాక్సిన్​ను వేగంగా పంపిణీ చేయడం కఠిన సవాల్​​' - vaccine distribution challenge

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్​ ప్రక్రియ త్వరలో భారత్​లో ప్రారంభం కానుంది. టీకాను వేగంగా పంపిణీ చేయడం భారత్​ సహా ప్రపంచ దేశాలన్నింటికీ అతిపెద్ద సవాల్​ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు టీకా అందించేందుకు ఏర్పాటు చేసిన కోవాక్స్​ ద్వారా 200కోట్ల టీకాలు సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

Speedy distribution of COVID-19 vaccine a major challenge for global govts: WHO experts
'వ్యాక్సిన్​ను వేగంగా పంపిణీ చేయడం పెద్ద సవాల్​'
author img

By

Published : Jan 5, 2021, 4:06 PM IST

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ప్రజలకు టీకా ఇవ్వడం ప్రారంభించాయి. ఆక్స్​ఫర్డ్​ ఆస్ట్రాజెనెకా-కొవిషీల్డ్​, భారత్​ బయోటెక్​-కొవాగ్జిన్​ టీకాల అత్యవసర వినియోగానికి ఇటీవలే భారత్​ అనుమతించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్​ ప్రక్రియ త్వరలో మొదలుకానుంది. అయితేే భారత్​ సహా అన్నీ దేశాలకు వ్యాక్సిన్​ను అత్యంత వేగంగా పంపిణీ చేయడం అతిపెద్ద సవాల్​ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కీలక భారత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 45 వ్యాక్సిన్లు ​ క్లినికల్​ ట్రయల్స్ దశలో, మరో 156 టీకాలు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్​ఓ ముఖ్య శాస్త్రవేత్తలు డా.సౌమ్య స్వామినాథన్​, సలహాదారు డా.హంసధ్వాని కుగనాంథమ్​ వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తి, సరఫరా, కరోనా చికిత్స కోసం డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసిన కోవాక్స్​ ​ ద్వారా 2021 చివరి నాటికి 200 కోట్ల టీకాలను అన్ని దేశాలకు అందించనున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్తలు మనోరమ ఇయర్​ బుక్​ ఆర్టికల్​లో తెలిపారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అన్ని దేశాల ప్రజలకు టీకా అందించడం కోసం సెపి, బిల్​ అండ్​ మిలిందా గేట్స్​ ఫౌండేషన్ సహాకారంతో కోవాక్స్​ను ఏర్పాటు చేశారు.

కరోనా వ్యాక్సిన్​ను మొదటగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకే అందించనున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్తలు స్ఫష్టం చేశారు. కరోనా తీవ్రత, ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆయా దేశాలకు టీకాలు అందిస్తామని పేర్కొన్నారు. టీకాల ద్వారా ప్రజల్లో హెర్డ్​ ఇమ్యూనిటీ పెరిగినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు భవిష్యత్తులోనూ కొనసాగించడం ముఖ్యమని వివరించారు. చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి ఉన్నందు వల్ల ఆంక్షలు నిషేధిస్తే వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

ప్రపంచ ఆరోగ్య భద్రత సూచీ గతేడాది ప్రచురించిన వివరాలు గమనిస్తే ఏ దేశమూ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని తేలింది. చాలా దేశాల్లో ఆరోగ్యవ్యవస్థ పునాదులు అంటువ్యాదులు, మహమ్మారులను నిలువరించే సామర్థ్యంతో లేవని వెల్లడైంది.

ఇదీ చూడండి: 'కిసాన్‌ పరేడ్‌' కోసం ట్రాక్టర్‌ ఎక్కిన మహిళలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.