ETV Bharat / international

'కొవిడ్- ఫ్లూ : రెండింటికీ ఒకే టెస్ట్' - ఆరోగ్య నిపుణుల సూచనలు

కరోనా వైరస్, సీజనల్​ ఫ్లూ... రెండింటినీ ఒకే టెస్టు ద్వారా గుర్తించే విధానానికి ఆమోదం తెలిపింది దక్షిణ కొరియా. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆ దేశ ఆరోగ్య నిపుణులు.

South Korea_Single test
'కొవిడ్, ఫ్లూ : రెండింటికీ ఒకే టెస్ట్'
author img

By

Published : Nov 4, 2020, 12:20 PM IST

కొవిడ్-19, సీజనల్​ ఫ్లూ వైరస్​ను ఒకే టెస్టుతో గుర్తించేందుకు దక్షిణ కొరియా కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. సీజనల్​ వ్యాధులు, కొవిడ్​ ఉద్ధృతి దృష్ట్యా ఈ నూతన విధానం తీసుకొచ్చామని పేర్కొంది ఆ దేశ ఆరోగ్య శాఖ.

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. కానీ, శీతాకాలంలో కొవిడ్​ ఉద్ధృతి మరింత పెరగనుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికాభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయడం వల్ల ప్రజలు బయట తిరగడం సాధరణమైంది. ఫలితంగా దేశంలో మళ్లీ వైరస్​ వ్యాప్తి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

" ఆరోగ్య శాఖ అధికారులు... కాంటాక్ట్ ట్రేసింగ్​ చేస్తూ కొవిడ్​​ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా ప్రయత్నించారు. కానీ, వైరస్​ వ్యాప్తి తీవ్రరూపం దాల్చింది".

-యూన్ టేహో, సీనియర్​ ఆరోగ్య నిపుణులు.

ఒకే టెస్టులో ఎలా?

సీజనల్​ ఫ్లూ, కరోనా వైరస్​ను ఒకేసారి గుర్తించేలా ఈ టెస్టు నిర్వహిస్తారు. కొవిడ్​ను గుర్తించే పీసీఆర్​ టెస్టు మాదిరిగానే ఈ పరీక్ష చేస్తారు. ముక్కు, నోటి నుంచే టెస్టు సాంపిల్స్ తీసుకుంటారు. ఇతర చిన్న వైరస్​ల​ను కూడా గుర్తించేలా అధునాతన మిషన్లు ఉపయోగించనున్నారు.

"వ్యాధిగ్రస్థులకు, ఆరోగ్య సేవలందించే వారికి శ్రమను తగ్గించేందుకు ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది".

-యూన్.

ప్రస్తుతం దక్షిణ కొరియాలో 26,925 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 474 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి:నేపాల్​లో 150 హెక్టార్లను ఆక్రమించిన చైనా...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.