ETV Bharat / international

వ్యాక్సినేషన్​లో చైనా జోరు.. 5 రోజుల్లో 10 కోట్లు...

author img

By

Published : Jun 3, 2021, 4:17 PM IST

చైనాలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ కాస్త ఆలస్యంగానే మొదలైంది. కానీ, ఇప్పుడు మిగతా దేశాల కంటే.. వేగంగా టీకా పంపిణీ అక్కడ జరగుతోంది. గత నెలలో ఐదు రోజుల వ్యవధిలోనే 10 కోట్లు టీకా డోసులను అక్కడి ప్రభుత్వం అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల్లో ఒక్క చైనాలో మూడో వంతు టీకా డోసుల పంపిణీ జరిగింది. అసలింతకీ వ్యాక్సినేషన్​లో ఇంతటి వేగంతో చైనా ఎలా దూసుకెళ్తోంది?

vaccination in china
చైనాలో కరోనా టీకా పంపిణీ

కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియను చైనా ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ.. మిగతా దేశాల కంటే వేగంగా దూసుకెళ్తోంది. గత నెలలో ఐదు రోజుల వ్యవధిలోనే.. 10 కోట్ల టీకా​ డోసులను పంపిణీ చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. చైనాలో ఉన్న ఏకపార్టీ వ్యవస్థ సహా.. దేశీయంగా వ్యాక్సిన్​ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండటం వల్ల టీకా పంపిణీలో ఈ జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది చివరినాటికి..

చైనా వ్యాక్సినేషన్​ విధానంలో అసమానంగా టీకాలను పంపిణీ చేయటం వంటి లోపాలున్నప్పటికీ.. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని 80 శాతం(140కోట్లు) జనాభాకు టీకా వేస్తామని అక్కడి ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

మంగళవారం వరకు చైనాలో 68 కోట్ల​ టీకా డోసులను పంపిణీ చేశారు. అందులో సగం డోసులను ఒక్క మే నెలలోనే అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన 190కోట్ల టీకా డోసుల్లో మూడో వంతు టీకా పంపిణీ.. చైనాలోనే జరిగిందని 'అవర్​ వరల్డ్​ ఇన్​ డేటా' అనే వెబ్​సైట్​ తెలిపింది.

ఇంత స్పీడ్​గా ఎలా?

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని అక్కడి అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చైనాలోని కంపెనీలు తమ ఉద్యోగులకు టీకాలను అందజేస్తున్నాయి. విద్యార్థులను, సిబ్బందిని టీకా తీసుకోవాల్సిందిగా పాఠశాలలు కోరుతున్నాయి. తమ పరిధిలోని వారు టీకా తీసుకున్నారా? లేదా? అని స్థానిక అధికారులు నిరంతరం నిఘా పెడుతున్నారు. అయితే.. ఈ విధానం ద్వారా పౌరుల స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీకీ గ్రామాగ్రామాన కార్యకర్తలు ఉన్నారని చైనాలోని గేట్స్​ ఫౌండేషన్​ మాజీ డైరెక్టర్​ రే యిప్​ అన్నారు. అందువల్లే.. ఇంతటి వేగంతో టీకాలను పంపిణీ చేసేందుకు సాధ్యమవుతోందని చెప్పారు.

అవర్ వరల్డ్ ఇన్ డేటా ప్రకారం చైనా ప్రస్తుతం సగటున ఒకరోజుకు 1.9 కోట్ల​ డోసులను అందజేస్తోంది. చైనా జనాభాలో1/4 వంతు జనాభా ఉన్న అమెరికాలో ఏప్రిల్​ నెలలో సగటున 34 లక్షల టీకా డోసులను మాత్రమే పంపిణీ జరిగింది. మరోవైపు.. ఇప్పటివరకు ఎంతమందికి పూర్తి స్థాయిలో టీకా అందించామన్న వివరాలను చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. సినోఫామ్​, సినోవాక్​ టీకాలను అక్కడ వినియోగిస్తున్నారు.

ఇదీ చూడండి: 20.5 కోట్ల మంది నిరుద్యోగంలోకి..

ఇదీ చూడండి: ఆయుష్షు పెంచే ఆరోగ్య సాధనం 'సైకిల్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.