ETV Bharat / international

కిమ్​ జోంగ్​ మళ్లీ మాయం- ఏం జరిగింది?

author img

By

Published : May 22, 2020, 6:23 PM IST

మే 1న ఓ ఎరువుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరైన ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్... మళ్లీ కనిపించకుండా ఉండడంపై నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది దక్షిణ కొరియా. ఆయన ఆచూకీపై మీడియా నివేదికలు, ఇతర అంశాలను గమనిస్తున్నామని పేర్కొంది.

SKorea says closely monitoring Kim's renewed absence
కిమ్ జోంగ్ ఉన్​

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆచూకీపై నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది దక్షిణ కొరియా. గతంలోలా మళ్లీ 3 వారాలుగా కనిపించకపోవటంపై దృష్టి పెట్టినట్లు ప్రకటించింది. ఆయనకు సంబంధించిన వార్తలు, ఇతర అంశాలను గమనిస్తున్నామని తెలిపింది.

కొద్దిరోజుల క్రితం కిమ్ జోంగ్ ఉన్​కు శస్త్రచికిత్స జరిగిన తర్వాత కనిపించకుండా పోయారు. ఎలాంటి ప్రభుత్వ, పరిపాలనాపరమైన కార్యక్రమాలకు హాజరుకాలేదు. దాంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అపస్మారక స్థితికి వెళ్లారని, చనిపోయారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. తనపై వస్తున్న వదంతులకు తెరదించుతూ మే 1న సున్చాన్​లో ఓ ఎరువుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు కిమ్. ఆ కార్యక్రమం తర్వాత మళ్లీ కిమ్ కనిపించటంలేదు.

" సంబంధిత అధికారులు ఈ అంశంపై నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో జనవరిలోనూ ఆయన 21 రోజల పాటు కనిపించకుండాపోయారు. మీడియా నివేదికల ద్వారా ఆయన అదృశ్యంపై పరిస్థితులను గమనిస్తున్నాం."

– యోహ్ సాంగ్ కీ, కొరియా ఏకీకరణ మంత్రిత్వ శాఖ

ఈ ఏడాదిలో పలుమార్లు..

ఈ ఏడాది పలుమార్లు జనజీవనానికి దూరంగా ఉన్నారు ఉత్తర కొరియా అధినేత. జనవరి 25న ఓ సంగీత కచేరీకి హాజరయ్యారు. ఫిబ్రవరి 16 వరకు 21 రోజుల పాటు అదృశ్యమయ్యారు. మళ్లీ మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 మధ్య 19 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఏప్రిల్ 11న డబ్ల్యూపీకే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మళ్లీ కనిపించలేదు. మే 1న కిమ్ ఓ కర్మాగారాన్ని ప్రారంభించినట్లు ఆ దేశ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

కిమ్ జోంగ్ ఉన్ కనిపించకపోయినప్పటికీ.. ఆయన తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు ఆ దేశ అధికారిక మీడియా ప్రజలకు తెలియచేస్తోంది. విదేశాలకు దౌత్యపరమైన లేఖలు పంపటం, సిబ్బందిని అభినందిస్తూ సందేశాలు ఇవ్వటం వంటివి చేస్తున్నట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.