ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్: సార్వత్రిక పోరులో మూన్​ విజయం - దక్షిణ కొరియా ఎన్నికలు

దక్షిణ కొరియా సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు మూన్​ జే ఇన్​కు చెందిన అధికార పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఆ పార్టీకి సానుకూలంగా మారింది.

SKOREA-POLL-RESULT
దక్షిణ కొరియా
author img

By

Published : Apr 16, 2020, 8:49 AM IST

దక్షిణ కొరియాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అధికార వామపక్ష పార్టీ భారీ మెజారిటీ సాధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అదుపు చేయటం అధ్యక్షుడు మూన్​జే ఇన్​కు రాజకీయంగా సానుకూలంగా మారింది.

జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లకు గాను 163 స్థానాలకు కైవసం చేసుకుంది మూన్​కు చెందిన డెమొక్రటిక్ పార్టీ. దాని మిత్రపక్ష పార్టీ 17 స్థానాలు గెలుచుకోవటం వల్ల మొత్తం బలం 180కి చేరింది.

ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీకి నేతృత్వంలోని యునైటెడ్ ఫ్యూచర్​ పార్టీ(యూఎఫ్పీ) కూటమి 97 స్థానాలకే పరిమితమైంది.

కరోనా విజృంభణ సమయంలోనూ బుధవారం జరిగిన పోలింగ్​లో ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 66.2 శాతం పోలింగ్ నమోదైంది. 1992 తర్వాత దక్షిణ కొరియాలో ఇదే రికార్డు.

ఇదీ చూడండి: కరోనా భయాల మధ్యే దక్షిణ కొరియాలో ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.