ఓ సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావటం వల్ల కలకలం రేగింది. రాత్రి 11:50 నిమిషాల ప్రాంతంలో ముంబయి నుంచి సింగపూర్ బయల్దేరిన 'ఎస్క్యూ423' విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చిందని సంస్థ అధికారులు నిర్దరించారు.విమానంలో 263 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
ఎట్టకేలకు సింగపూర్‌లోని చంగీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు సురక్షితంగా దిగినట్లు అధికారులు వెల్లడించారు.
దీనిపై సమగ్ర విచారణకు అదేశించినట్లు ఆ విమాన సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవి తెలుపలేమని పేర్కొంది.