నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా 10 వారాల క్రితం హాంగ్‌కాంగ్‌లో మొదలైన ఉద్యమం ఇప్పుడు హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలతో నగరమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
విమానాశ్రయం వద్ద...
హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చేపట్టిన నిరసనలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. సోమవారం వేలమంది ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల దృష్ట్యా విమానసేవలను నిలిపివేశారు అధికారులు.
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద నిరసనకారులు పెద్దయెత్తున చేరుకుని ఆందోళనలు చేపట్టారు. నగరంలోని ప్రధాన వాణిజ్య సముదాయాలు, వీధుల గుండా ర్యాలీలు నిర్వహించారు.
అరెస్ట్‌లు...
వీధుల్లోకి చేరిన వేల మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బులెట్లు ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యంలో తీవ్రంగా గాయప్డడారు.
ఇదీ చూడండి: మయన్మార్‌లో వరద విలయతాండవం