ETV Bharat / international

Afghan News: కాబుల్​ ఎయిర్​పోర్ట్​ వద్ద రాకెట్​ దాడులు

అఫ్గాన్(Afghan News)​ రాజధాని కాబుల్​లోని​ అంతర్జాతీయ విమానాశ్రయం(Kabul Airport) సమీప ప్రాంతంలో సోమవారం రాకెట్ దాడి జరగడం కలకలం రేపింది. దీంతో అమెరికా తరలింపు ప్రక్రియకు కాసేపు అంతరాయం కలిగింది. అయితే.. ఈ దాడులు ఎవరు చేశారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

rockets on afghan
అఫ్గాన్​లో రాకెట్లు
author img

By

Published : Aug 30, 2021, 9:41 AM IST

Updated : Aug 30, 2021, 12:53 PM IST

తాలిబన్​ ఆక్రమిత అఫ్గానిస్థాన్​లో(Afghan News) పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. అమెరికా దళాల ఉపసంహరణకు గడువు దగ్గరపడుతున్న క్రమంలో సోమవారం .. కాబుల్​ విమానాశ్రయం(Kabul airport blast) సమీప ప్రాంతంలో రాకెట్​ దాడులు జరగడం కలకలం సృష్టించింది. అయితే.. ఈ క్షిపణులను ఎవరు ప్రయోగించరాన్నది ఇంకా తెలియరాలేదు.

కాబుల్​కు సమీపంలోని సలీమ్​ కార్వాన్​ ప్రాంతంపై సోమవారం ఉదయం ఈ రాకెట్ దాడులు జరిగాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మూడు సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని.. ఆ వెంటనే ఆకాశంలో ఈ రాకెట్లు కనిపించాయని చెప్పారు. ఈ పరిణామంతో ప్రజలంతా భయంతో పరుగురు తీశారని వెల్లడించారు.

ఈ రాకెట్​ దాడుల కారణంగా అమెరికా తరలింపు ప్రక్రియకు కాసేపు ఆటంకం ఎదురైంది. దీనిపై ఆ దేశం వెంటనే స్పందించలేదు. ఈ రాకెట్ దాడుల గురించి, అధ్యక్షుడు జో బైడెన్​కు అధికారులు తెలియజేశారని శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. బలగాల తరలింపు కోసం మోహరింపును పెంచాలని బైడెన్ సూచించారని చెప్పింది. రాకెట్​ దాడుల తర్వాత తిరిగి యథావిధిగా తరలింపు ప్రక్రియను అమెరికా కొనసాగించినట్లు పేర్కొంది.

కాబుల్​ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు ఐసిస్​-కె పన్నిన కుట్రను ఆదివారం అమెరికా భగ్నం చేసింది. ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గుర్తించి, డ్రోన్​ దాడి ద్వారా హతమార్చామని చెప్పింది.

ఇదీ చూడండి: ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌.. ఇంకా 300మంది అఫ్గాన్‌లోనే!

ఇదీ చూడండి: Afghan Taliban: టీవీ యాంకర్​ను లైవ్​లో గన్స్​తో బెదిరించిన తాలిబన్లు

Last Updated : Aug 30, 2021, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.