ETV Bharat / international

బొగ్గు గనిలో పేలుడు- ఏడుగురు కార్మికులు మృతి - పాకిస్థాన్ బలూచిస్థాన్​లో పేలుడు

పాకిస్థాన్​ బలూచిస్థాన్​ రాష్ట్రంలోని ఓ బొగ్గు గనిలో గ్యాస్​ పేలుడు సంభవించి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గత వారం ఇదే రాష్ట్రంలో జరిగిన మరో పేలుడు ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Seven miners killed in explosion at coal mine in Pakistan
బొగ్గుగనిలో పేలుడు- ఏడుగురు కార్మికులు మృతి
author img

By

Published : Mar 17, 2021, 6:47 PM IST

పాకిస్థాన్​లో విషాద ఘటన జరిగింది. బొగ్గు గనిలో గ్యాస్​ పేలుడు సంభవించి ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్​ రాష్ట్రంలోని ఓ గనిలో ఈ ప్రమాదం సంభవించింది.

హనాయ్​ జిల్లా తోర్​గఢ్​ గనిలో మీథేన్​ వాయువు కారణంగా సోమవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించినట్లు బలూచిస్థాన్​ గని కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు సుల్తాన్​ మహమ్మద్​ లాలా తెలిపారు. గనిలోనుంచి కార్మికుల మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారని చెప్పారు.

ప్రమాద సమయంలో 1,500 అడుగుల లోతులో కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. గతవారం బలూచిస్థాన్​ మార్వర్​లోని ఓ​ బొగ్గుగనిలో జరిగిన పేలుడులో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం, గనుల యజమానులు ఎలాంటి భద్రతా చర్యలు పాటించడం లేదని లాలా ఆవేదన వ్యక్తం చేశారు. బలూచిస్థాన్​లో 72 వేర్వేరు ఘటనల్లో 102 మంది కార్మికులు మరణించారని తెలిపారు.

ఇదీ చూడండి:యూనివర్సిటీలో నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.