ETV Bharat / international

తుపాను ధాటికి జపాన్ గజగజ.. నలుగురు గల్లంతు

జపాన్​లో హేషిన్​ తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి నలుగురు గల్లంతయ్యారు. క్యూషు ప్రాంతంలో మరో 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.

second powerful typhoon to slam Japan in a week damaged buildings
'హేషిన్'​ ధాటికి నలుగురు గల్లంతు- 37మందికి గాయాలు
author img

By

Published : Sep 7, 2020, 4:07 PM IST

జపాన్​లో వారం రోజుల వ్యవధిలోనే రెండో తుపాను విధ్వంసం సృష్టించింది. 'హేషిన్'​ ధాటికి అనేక ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. షీబా గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు గల్లంతవగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. క్యూషు ప్రాంతంలో మరో 37 మందికి తీవ్ర గాయాలైనట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ధాటికి అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్​ సేవలకు అంతరాయం ఏర్పడి కొన్ని ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి.

second powerful typhoon to slam Japan in a week damaged buildings
విరిగిపడిన కొండచరియలు

గంటకు 144 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కొరియా ఆగ్నేయ తీరం వైపు తుపాను కదులుతోంది. హేషిన్ ధాటికి జపాన్​ దక్షిణ ద్వీపంలో భారీ నష్టం సంభవించింది. రాకాసి అలలు తీరంపై విరుచుకు పడుతున్నాయి. గత వారం మేసాక్​ తుపాను వల్ల పలువురుకి గాయాలవగా...అనేక భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.

జపాన్​లో తుపాను బీభత్సం

ఇదీ చూడండి: అమెరికాలో ఆగని కార్చిచ్చు- వేల ఎకరాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.